Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాగార్జునసాగర్​లో జల విహారానికి లాంచీలు సిద్ధం

Webdunia
సోమవారం, 9 నవంబరు 2020 (21:51 IST)
గలగల పారే కృష్ణమ్మ పరవళ్లు, ఎటు చూసినా ప్రకృతి రమణీయతను తలపించే సాగరంలో... లాంచీల ప్రయాణానికి ఏడాదిగా బ్రేకులు పడ్డాయి. భద్రతా కారణాల దృష్ట్యా రాష్టంలోని పలు పర్యాటక ప్రాంతాలతో పాటు నాగార్జున సాగర్​లో సైతం లాంచీల విహారాన్ని ప్రభుత్వం నిలిపి వేయగా... ఇప్పుడది తిరిగి ప్రారంభం కానుండటంతో ప్రకృతి ఒడిలో పర్యటకులు ఆనందంగా గడపనున్నారు.
 
పర్యటకులకు మర్చిపోలేని మధుర స్మృతులు మిగిల్చే సాగరంలో... లాంచీ ప్రయాణానికి ఏడాది కాలంగా బ్రేకులు పడ్డాయి. భద్రతా కారణాల దృష్ట్యా రాష్టంలోని పలు పర్యాటక ప్రాంతాలతో పాటు గుంటూరు జిల్లా నాగార్జున సాగర్​లో సైతం లాంచీల విహారాన్ని ప్రభుత్వం నిలిపి వేసింది. దీనివల్ల ఇక్కడ బోటు చప్పుళ్లు వినిపించటంలేదు.
 
కష్టంగా మారిన చిరువ్యాపారుల జీవనంలాంచీ స్టేషన్ ప్రాంగణంతో పాటు లాంచీ ప్రయాణికులపై ఆధార పడి జీవించే చిరు వ్యాపారుల దుకాణాలు బోసిపోవడంతో... వారి జీవనం గడవడమే కష్టంగా మారింది. పర్యటకులు సైతం లాంచీ స్టేషన్ వరకు వచ్చి నిరుత్సాహంగా వెనుదిరిగి వెళ్తున్నారు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో అనుకూల పరిస్థితులు ఉండటంతో సాగర్​లో లాంచీల జల విహారానికి మార్గం సుగమమైంది.

పలువురు అధికారులు వచ్చి లాంచీల ఫిట్ నెస్ పరిశీలించి వెళ్లారు. జల విహారానికి సంబంధించి ప్రభుత్వం అనుమతులు ఇవ్వగా... ఇరిగేషన్ శాఖ నుంచి అనుమతి రావాల్సి ఉంది. అది రాగానే జలాశయం నుంచి నాగార్జున కొండకు లాంచీ విహారాన్ని ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు లాంచీ స్టేషన్ అధికారులు చెబుతున్నారు.

అన్ని ఏర్పాట్లు పూర్తిఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసి లాంచీలను సిద్ధంగా ఉంచామని... మరో నాలుగైదు రోజుల్లో జల విహారం మొదలవుతుందని స్టేషన్ అధికారి భైరవ స్వామి తెలిపారు. ఎంతో కాలంగా లాంచీల ప్రయాణం కోసం ఎదురు చూస్తున్న ప్రకృతి ప్రేమికులు.. పర్యటకుల ఆనందంతో పాటు మానసిక ఉల్లాసం కలగనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజకీయాలకు స్వస్తి, గుడ్ బై: నటుడు అలీ (video)

అభిమానితో కలిసి భోజనం చేసిన బాలయ్య.. వీడియో వైరల్ (Video)

'కల్కి 2898 AD'పై కేజీఎఫ్ స్టార్ యష్ ప్రశంసల జల్లు

ట్విట్టర్-ఫేస్ బుక్ పేజీలను క్లోజ్ చేసిన రేణూ దేశాయ్, టార్చర్ పెడుతున్నది పవన్ ఫ్యాన్స్ కాదా?

హైదరాబాద్‌లో తమన్నా భాటియా ఓదెల 2 కీలకమైన యాక్షన్ షెడ్యూల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దానిమ్మ కాయలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

అలాంటి మగవారికి అశ్వగంధ లేహ్యంతో అద్భుత ప్రయోజనాలు

బరువు తగ్గడం: మీ అర్థరాత్రి ఆకలిని తీర్చడానికి 6 ఆరోగ్యకరమైన స్నాక్స్

పిల్లలు స్వీట్ కార్న్ ఎందుకు తింటే..?

చర్మ సౌందర్యానికి జాస్మిన్ ఆయిల్, 8 ఉపయోగాలు

తర్వాతి కథనం
Show comments