Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నాగార్జునసాగర్ లో 144 సెక్షన్.. ఎందుకో తెలుసా?

Advertiesment
Section 144
, శుక్రవారం, 21 ఆగస్టు 2020 (09:23 IST)
నాగార్జున సాగర్ జలాశయం పూర్తి స్థాయిలో నిండుతుండటం వలన సాగర్ డ్యామ్ క్రస్టు గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తున్న నేపధ్యంలో సాగర్ పరిసర ప్రాంతాల్లో  144సెక్షన్ విదిస్తున్నట్లు గురజాల డిఎస్పీ శ్రీహరి బాబు తెలిపారు.

నాగార్జున సాగర్ బోర్డర్ పోలీస్ చెక్ పోస్ట్ వద్ద విలేకర్లతో మాట్లాడారు. కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుండటం వలన ముందు జాగ్రత్త చర్యలో భాగంగా సాగర్ చుట్టు ప్రక్కల ప్రాంతాలకు పర్యటకులకు ఎటువంటి అనుమతులు ఉండవన్నారు.

సాగర్ కు వచ్చి పర్యాటకులు ఇబ్బందులకు గురి కావద్దని సూచించారు. ఆయన వెంట మాచర్ల రూరల్ సిఐ భక్తవతల రెడ్డి, మాచర్ల టౌన్ సిఐ రాజేశ్వరరావు, విజయపురిసౌత్ ఎస్ ఐ  కె పాల్ రవిందర్, చెక్ పోస్ట్ ఏఎస్ ఐ రామయ్య తదితరులు ఉన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం... 9 మంది గల్లంతు