Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్నేహితురాలు కంటిపై గుద్దింది.. కంటిపై రెప్పలోని నరం చిట్లింది.. కంటి నుంచి ధారగా రక్తం!

స్నేహితురాలు కంటిపై గుద్దింది.. అంతే ఆ అమ్మాయి కంటిపై రెప్పలోని నరం చిట్లింది. అంతే కంటి నుంచి రక్తం ధారగా వస్తూనే ఉంది. ఈ ఘటన తూర్పుగోదావరిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తూర్పుగోదావరి జిల్లా

Webdunia
గురువారం, 7 జులై 2016 (10:10 IST)
స్నేహితురాలు కంటిపై గుద్దింది.. అంతే ఆ అమ్మాయి కంటిపై రెప్పలోని నరం చిట్లింది. అంతే కంటి నుంచి రక్తం ధారగా వస్తూనే ఉంది. ఈ ఘటన తూర్పుగోదావరిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తూర్పుగోదావరి జిల్లా కరప మండలం నడకుదురుకు చెందిన ముమ్మిడి మధుబాల స్థానిక జిల్లా పరిషత్‌ ఉన్నతపాఠశాలలో పదో తరగతి చదువుతోంది. 
 
మంగళవారం సాయంత్రం మధుబాల ఇంట్లో కూర్చుని చదువుకుంటుండగా ఒక్కసారిగా ఆమె ఎడమ కంటి నుంచి ఏకధాటిగా రక్తం రావడం ప్రారంభమైంది. ఎంత ప్రయత్నించినా రక్తమాగలేదు. రక్తం ధారలుగా రావడంతో కంగారు పడిన మధుబాల తల్లిదండ్రులు కాకినాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చూపించినా ఫలితం లేకపోయింది. 
 
ఆ డాక్టర్లు మధుబాల కంటికి మందులు, ఐ డ్రాప్స్‌ ఇచ్చి పంపేశారు. అవి వేసుకున్నా.. కంటి నుంచి రక్తం ధారలుగా రావడంతో మళ్లీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షలు చేయించడంలో కంటిపై రెప్పలోని నరం చిట్లినట్లు గుర్తించారు. ఇందుకు తగిన చికిత్స కోసం వైద్యులు ప్రయత్నిస్తున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

స్వరాష్ట్రంలో డిపాజిట్ కోల్పోయిన జోకర్... : ప్రకాష్ రాజ్‌పై నిర్మాత వినోద్ కుమార్ ఫైర్

అభిమానుల రుణం ఈ జన్మలో తీర్చుకోలేను : జూనియర్ ఎన్టీఆర్

మహేష్ బాబు ఆవిష్కరించిన మా నాన్న సూపర్ హీరో ట్రైలర్‌

యూట్యూబర్ హర్ష సాయిపై లుకౌట్ నోటీసులు జారీ.. ఎందుకంటే?

విజువ‌ల్ గ్రాఫిక్స్‌ హైలైట్ గా శ్ర‌ద్ధాదాస్ త్రికాల చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తేనె మోతాదుకి మించి సేవిస్తే జరిగే నష్టాలు ఏమిటి?

గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించుకునేదెలా?

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

తర్వాతి కథనం
Show comments