Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లైనా.. ఆ మగువలు ప్రేమించుకున్నారు.. పెళ్లి చేసుకున్నారు.. అది జరగకపోతే ఆత్మహత్యేనట!

సాధారణంగా ప్రేమ అనేది ఆలుమగల నడుమ పుడుతుంది. కాని ఇక్కడ ఇద్దరు మగువల మధ్య ప్రేమ చిగురించింది. ఇరువురు మహిళలే అయినప్పటికీ, ఒకరినొకరు ఇష్టపడ్డారు. తాము కలసి జీవించాలని కుటుంబాన్ని వదులుకోవడానికి కూడా సి

Webdunia
గురువారం, 7 జులై 2016 (10:01 IST)
సాధారణంగా ప్రేమ అనేది ఆలుమగల నడుమ పుడుతుంది. కాని ఇక్కడ ఇద్దరు మగువల మధ్య ప్రేమ చిగురించింది. ఇరువురు మహిళలే అయినప్పటికీ, ఒకరినొకరు ఇష్టపడ్డారు. తాము కలసి జీవించాలని కుటుంబాన్ని వదులుకోవడానికి కూడా సిద్ధపడ్డారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. సోనియా(27), మమత(26)లు ఇద్దరు ఇరుగు పొరుగు ఇళ్లలో నివాసముండేవారు. వీరిద్దరికి ఎనిమిదేళ్ల కిందట వివాహమైంది. అంతేకాకుండా ఈ ఇద్దరు వివాహితలకు చెరో సంతానం కూడా ఉంది.
 
ఇద్దరి భర్తలు విధుల కారణంగా బయటికి వెళ్లేవారు. ఆ తర్వాత ఒంటరిగా ఉన్న వీరిద్దరూ ఒకేచోట చేరి ఎక్కువ సమయాన్ని గడిపేవారు. ఏకాంతంగా గడపడంతో... ఒకరి అభిప్రాయాలను ఒకరు అడిగి తెలుసుకున్నారు. దీంతో ఇద్దరి మధ్య అత్యంత చనువు ఏర్పడింది. దీంతో వారిద్దరూ ప్రేమలో పడ్డారు. అంతే ఇద్దరూ కలిసి వివాహం చేసుకొని దాంపత్య జీవితాన్ని ఆనందంగా గడపాలని నిర్ణయించుకున్నారు. మన్సరోవర్ గ్రామంలోని ఓ ఆలయంలో ఈ మహిళలు ఇద్దరూ వివాహం చేసుకున్నారు. 
 
వాళ్లు పెళ్లి కోసం చేసుకున్న ఏర్పాట్లు ప్రకారం... సోనియా భర్తగా, మమతా భార్యగా వ్యవహరించారు. వారిరువురి కుటుంబాలకు దూరంగా వెళ్లి దాంపత్య జీవితాన్ని ప్రారంభించారు. అయితే ఆరు నెలల తర్వాత మమత సోదరుడు వీరిద్దరు కలిసి నివాసం ఉంటున్న చోటును కనుక్కుని... వారి దగ్గరికి వెళ్లి మీ వివాహనికి ఇరు కుటుంబాలు మద్దతునిచ్చారని వారితో నమ్మబలికి ఇంటికి రావాల్సిందిగా కోరాడు. వారు స్వగ్రామానికి తిరిగి రాగానే మొదటి వివాహానికి సంబంధించి ఇరువురి అత్తలు సోనియా(భర్తగా చెప్పుకునే మహిళ)ను చితకబాది, ఊరి నుంచి తరిమికొట్టారు. సోనియా వెళ్లిన తర్వాత మమతా కనిపించకుండా పోయింది.
 
ఈ సంఘటన రాజస్థాన్లోని టోన్క్ జిల్లాలోని అమ్లీ గ్రామంలో చోటు చేసుకుంది. తన భాగస్వామి మమత ఆచూకీ కోసం సానియా వెతకని చోటంటూ లేదు. తన తోడు కోసం వెతికి వెతికి నీరసించి చివరకు డిగ్గి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. స్వలింగ వివాహాలు చెల్లుతాయని, వారి విషయంలో ఎవరి అనుమతి అవసరం లేదని నిరూపించడానికి న్యాయ సహాయం కోసం కోర్టు మెట్లు కూడా సానియా ఎక్కింది. దీంతో కోర్టు మమత కుటుంబ సభ్యులకు లీగల్ నోటీసులు పంపింది. మమత కోరికలు నెరవేర్చడానికి తన ఇంటిని కూడా అమ్మేసినట్టు సోనియా చెబుతోంది. మమతా ఆచూకీ గనుక దొరక్కపోతే ఆత్మహత్య చేసుకుంటానని సోనియా కన్నీరుమున్నీరయ్యింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అలనాటి నటి పుష్పలత కన్నుమూత..

మెడలో మంగళసూత్రం బరువైందమ్మా? భర్తకు తేరుకోని షాకిచ్చిన 'మహానటి'!!

అభిమానులకు జూ.ఎన్టీఆర్ విజ్ఞప్తి.. ఓర్పుగా ఉండాలంటూ ప్రకటన

చిన్న చిత్రాలే పెద్ద సౌండ్ చేస్తున్నాయి.. నిర్మాత రాజ్ కందుకూరి

వెంకట్ పాత్రకు మంచి రెస్పాన్స్ వస్తోంది.. ‘పోతుగడ్డ’ ఫేమ్ ప్రశాంత్ కార్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

క్యాన్సర్ వ్యాధిని తగ్గించగల 8 ఆహారాలు

పిల్లల కడుపుకు మేలు చేసే శొంఠి.. ఎలాగంటే..?

మహిళలకు స్టార్ ఫ్రూట్ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments