Webdunia - Bharat's app for daily news and videos

Install App

రామతీర్థంలో సొమ్మసిల్లి పడిపోయిన బీజేపీ నేతలు.. తీవ్ర ఉద్రిక్తత

Webdunia
గురువారం, 7 జనవరి 2021 (11:10 IST)
పోలీసుల ఓవరాక్షన్ కారణంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు, విష్ణువర్థన్‌ రెడ్డి రామతీర్థంలో సొమ్మసిల్లి పడిపోయారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రామతీర్థంలోని బోడికొండపై ఉన్న పురాతన కోదండరాముడి విగ్రహ శిరస్సును గుర్తు తెలియని వ్యక్తులు తొలగించిన విషయం తెలిసిందే.

ఆలయానికి సమీపంలో ఉన్న కోనేటిలో రాముల వారి శిరస్సు లభ్యమైంది. నాటి నుంచి నిందితులపై చర్యలు తీసుకోవాలంటూ ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. రామతీర్థం కొండపైకి ర్యాలీగా వెళ్లేందుకు బీజేపీ నేతలు యత్నిస్తున్నారు. నెల్లిమర్ల జంక్షన్‌ దగ్గర బీజేపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు.

పోలీసులతో బీజేపీ నేతల వాగ్వాదానికి దిగారు. ఈ నేపథ్యంలో ఇరువురి మధ్య తోపులాట జరిగింది. రామతీర్థం కొండపైకి ఐదుగురిని మాత్రమే అనుమతిస్తామని పోలీసులు తెలిపారు.

అయితే అందరినీ అనుమతించాలని బీజేపీ నేతలు, కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులను తోసుకుంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు, కార్యకర్తలు ముందుకు వచ్చారు. తోపులాటలో సోమువీర్రాజు, విష్ణువర్థన్‌ రెడ్డి సొమ్మసిల్లి పడిపోయారు.

పలువురు బీజేపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ర్యాలీగా వస్తున్న ఎమ్మెల్సీ మాధవ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. రామతీర్థం పరిసరాల్లో భారీగా పోలీసులు మోహరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వరుణ్ తేజ్ VT15 అనంతపూర్ షెడ్యూల్స్ పూర్తి, నెక్స్ట్ కొరియాలో

ఈ విజయ వైభవం మాకు చాలా ప్రత్యేకం: రుత్విక్, సాత్విక్

Pawan Kalyan: రిటర్న్ గిఫ్ట్ స్వీకారం... సినిమా రంగం కోసం ప్రత్యేక పాలసీ

క్రిష్ణ జయంతి సందర్భంగా 800 స్క్రీన్‌లలో ఖలేజా రీ-రిలీజ్

అసభ్యతలేని నిజాయితీ కంటెంట్‌తో తీసిన సినిమా నిలవే : హీరో సౌమిత్ రావు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Fish vegetarian: చేపలు శాకాహారమా? మాంసాహారమా?

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments