Webdunia - Bharat's app for daily news and videos

Install App

గ‌ణ‌ప‌తి విగ్ర‌హాల ఆంక్ష‌ల‌పై ఏపీ గ‌వ‌ర్న‌ర్ కు బీజేపీ ఫిర్యాదు

Webdunia
మంగళవారం, 7 సెప్టెంబరు 2021 (13:12 IST)
ఏపీలో గ‌ణ‌ప‌తి విగ్ర‌హాల ఏర్పాటుపై ర‌చ్చ కొన‌సాగుతోంది. దీనిపై ఏపీ గ‌వ‌ర్న‌ర్ బిశ్వ‌భూష‌ణ్ హ‌రిచంద‌న్ ని క‌లిసి, బిజెపి నేతలు ప్ర‌భుత్వంపై ఫిర్యాదు చేశారు.

బీజేపీ మాజీ అధ్య‌క్షుడు క‌న్నా ల‌క్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత హిందూ దేవాలయాలపై 150 దాడి సంఘటనలు జరిగాయ‌ని, ఒక్క‌దానిపైనా చర్యలు తీసుకోలేద‌న్నారు. వినాయక చవితి సామూహికంగా చేసుకోవడం ఆనవాయితీగా వస్తోంద‌ని, కేవలం వినాయక చవితి మాత్రమే ఇళ్లల్లో చేసుకోమనడం దారుణమ‌న్నారు. 
 
ఈవిషయం గవర్నర్ దృష్టి కి తీసుకుని వెళ్ళామ‌ని, వెంటనే చర్యలు తీసుకోవాలని గవర్నర్ ను కోరామ‌ని బీజేపీ నేత‌లు వివ‌రించారు. కరోనా నిబంధనలు అనుగుణంగా చవితి వేడుకలు చేయడానికి అవకాశం ఇవ్వమన్నామ‌ని, ఎట్టి ప‌రిస్థితుల్లో గ‌ణ‌ప‌తి ఉత్స‌వాల‌ను జరుపుతాం అని క‌న్నా చెప్పారు. హిందూ సమాజాన్ని తక్కువగా చూడడానికి ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంద‌న్నారు. 
 
విహెచ్ పి రాష్ట్ర ఉపాధ్యక్షుడు పల్నాటి వెంకటస్వామి నాయుడు మాట్లాడుతూ, వినాయక చవితి హిందువుల‌కు ముఖ్యం అని, హిందూ సమాజం పట్ల ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా ఉంద‌న్నారు. దేవాదాయ‌శాఖ మంత్రి వెల్లంప‌ల్లికి సిగ్గు ఉందా?  హిందువుల పట్ల అవమానకరంగా మాట్లాడ్డం ఏంట‌ని ప్ర‌శ్నించారు. ఆంధ్రప్రదేశ్ అంతా గ‌ణేష్ ఉత్సవాలు జరుపుతామ‌న్నారు. 
 
గవర్నర్ ని కలిసిన వారిలో  బిజెపి మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ తో పాటు, సత్య మూర్తి, పాతూరి నాగభూషణం తదితరులు ఉన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

Ananya: స్మాల్ స్కేల్ ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు అడ్రెస్ గా మారిన అనన్య నాగళ్ళ

మారుతీ చిత్రం బ్యూటీ నుంచి కన్నమ్మ సాంగ్ విడుదల

Shambhala: ఆది సాయికుమార్ శంబాల నుంచి హనుమంతు పాత్రలో మధునందన్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments