Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రత్యేక ఇవ్వకపోవడం వల్లే నష్టపోయాం : రాంమాధవ్

Webdunia
గురువారం, 6 జూన్ 2019 (08:11 IST)
విభజన వల్ల నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వక పోవడం వల్ల సీమాంధ్ర ఓటర్లు తమను తిరస్కరించారని బీజేపీ సీనియర్ నేత, జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ అభిప్రాయపడ్డారు. ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీకి ఒక్క సీటు కూడా రాలేదు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం వల్లే తాము ఏపీలో నష్టపోయామన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం వల్ల తాము ఆంధ్రాలోనే కాదని తెలంగాణలో కూడా దెబ్బతిన్నామన్నారు. ముఖ్యంగా, సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో తాము గెలిచిన స్థానాల్లో నివశించే సీమాంద్రకు చెందిన సెటిలర్స్ ఓట్లు బీజేపీకి పడలేదన్నారు. 
 
సెటిలర్స్ కూడా ఏపీకీ ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం వల్లే బీజేపీకి దూరమయ్యారని ఆ ఓట్లన్నీ కాంగ్రెస్ వైపు మళ్లాయన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బీజేపీ మోసం చేసిందని ఆనాటి సీఎం చంద్రబాబు నాయుడు తప్పుడు ప్రచారం చేశారని, రాజకీయ ఉద్దేశంతో తమపై చేసిన దుష్ప్రచారం తమకు బాగానే నష్టాన్ని కలిగించిందన్నారు. 
 
ఇకపోతే ఆధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి సైతం ఇటీవలే ప్రధాని నరేంద్ర మోడీని కలిసి ప్రత్యేక హోదాపై చర్చించారని ఆయన గుర్తుచేశారు. ప్రధాని దానిపై చర్చించి నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. 14వ ఆర్థిక సంఘం సలహాల మేరకు ఆనాడు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆయన చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నిత్యా మేనన్‌ ను సార్‌ మేడమ్‌ అంటోన్న విజయ్ సేతుపతి ఎందుకంటే..

Murali mohan: డొక్కా సీతమ్మ కథ నాదే, నన్ను మోసం చేశారు : రామకృష్ణ

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments