Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉచితంగా మందులను సరఫరా పంపిణీ చేసిన బయోఫోర్

Webdunia
ఆదివారం, 23 మే 2021 (16:50 IST)
కొవిడ్ మహమ్మారిని ఎదుర్కొనే విపత్కర పరిస్థితుల్లో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులకు రూ.25 లక్షల విలువైన మందులను ఉచితంగా అందించేందుకు హైదరాబాద్ నగరానికి చెందిన బయోఫోర్ ఇండియా ఫార్మాస్యూటికల్స్ సీఈవో రంగిశెట్టి జగదీశ్ బాబు ముందుకొచ్చారు. ఈ మేరకు సంబంధిత మందులను హైదరాబాద్‌లోని సంస్థ కార్యాలయం సిబ్బంది రెండు వాహనాల్లో తీసుకువచ్చి గుంటూరులోని సెంట్రల్ డ్రగ్స్ స్టోర్‌లో అధికారులకు ఆదివారం అందజేశారు.
 
బయోఫోర్ సీఈవో రంగిశెట్టి జగదీశ్ బాబు అందజేసిన మందుల్లో డాక్సీసైక్లిన్ 100 ఎంజి టాబ్లెట్లు 50వేలు, ఐవర్‌మెక్టిన్ 12ఎంజి టాబ్లెట్లు 25వేలు, అజిత్రోమైసిన్ 500 ఎంజి టాబ్లెట్లు 25వేలు, వి టాబ్ 1లక్ష, జింకోవిట్ టాబ్లెట్లు 50వేలు, ఎకోస్ప్రిన్ 75ఎంజి టాబ్లెట్లు 50వేలు ఉన్నాయని జిల్లా అధికారులు తెలిపారు. 
 
ఈ మందులన్నీ కోవిడ్ బారినపడిన 5 వేల మంది పేషెంట్లకు అందించనున్నారు. కొవిడ్‌ బాధితులకు ప్రభుత్వం మెరుగైన వైద్యం అందిస్తోందని.. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో సాయం అందించడం అభినందనీయమని.. వారికి ప్రభుత్వం తరఫున అభినందనలు తెలుపుతున్నామని స్టేట్ కొవిడ్ స్పెషలాఫీసర్ డాక్టర్ అర్జా శ్రీకాంత్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. 
 
కరోనా బాధితులకు అవసరమైన అన్ని వైద్యసదుపాయాలు ప్రభుత్వం కల్పిస్తున్నప్పటికీ.. బాధితుల సంఖ్య పెరుగుతోందని.. ఈ పరిస్థుతుల్లో కోవిడ్ చికిత్సకు అవసరమయ్యే మెడికల్ ఎక్విప్మెంట్, మందులను అందించేందుకు సంస్థలు ముందుకు రావాలని ఆయన కోరారు. బయోఫోర్ సీఈవో రంగిశెట్టి జగదీశ్ బాబు లాంటి వారిని స్ఫూర్తిగా తీసుకుని సాయం చేసేందుకు ముందుకు రావాలని డాక్టర్ అర్జా శ్రీకాంత్ పిలుపునిచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments