Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

25 లక్షల కుటుంబాలకు ఉచిత కోవిడ్ సంరక్షణ మందుల పంపిణీని ప్రారంభించిన ధనీ

Advertiesment
25 లక్షల కుటుంబాలకు ఉచిత కోవిడ్ సంరక్షణ మందుల పంపిణీని ప్రారంభించిన ధనీ
, శుక్రవారం, 14 మే 2021 (22:06 IST)
ధనీ యాప్ రూ. 90 కోట్ల విలువైన 25 లక్షల ఉచిత కోవిడ్ సంరక్షణ ఆరోగ్య కిట్స్‌ని పంపిణీ చేయడం ప్రారంభించింది. దీనివల్ల 50 లక్షల కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతుంది. ప్రతి కోవిడ్ సంరక్షణ ఆరోగ్య కిట్‌లో 2 వ్యక్తులకు కావలసిన రోగ నిరోధక మందులు ఉంటాయి. ధనీ అనేది ఇండియా బుల్స్ గ్రూప్ యొక్క డిజిటల్ యాప్ ఆధారిత ఆరోగ్య సంరక్షణ వ్యాపారం.
 
ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సిఫారసు చేసిన ప్రకారం ఈ కిట్‌ని ప్యాక్ చేయడమైనది మరియు కోవిడ్ 19లో ప్రారంభ వ్యాధినిరోదక సంరక్షణగా సహాయపడుతుంది. ఈ కిట్‌లో ఒక నెలకు సరిపడా మందులు ఉన్నాయి. విటమిన్ సి, విటమిన్ డి3, జింకు ద్వారా మనిషిలో రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి మరియు జ్వరం లేదా ఒళ్ళు నొప్పులు ఉంటే వేసుకునేందుకు పారాసెటమాల్ కూడా ఉంది.
 
ఈ కార్యక్రమం నుంచి ప్రయోజనం పొందాలనుకునే ప్రజలు ధనీ యాప్‌కి లేదా ఫార్మసీ డాట్ ధనీ డాట్ కామ్ లాగిన్ అయి ఉచితంగా ఆర్డరు పెట్టుకోవచ్చు. ఇంకా, డాక్టర్లు మరియు స్పెషలిస్టులతో రేయింబవళ్ళు ఉచిత వీడియో కాల్స్ కూడా ధనీ అందిస్తోంది. ఎవరైనా సరే 15 సెకన్ల లోపు వీడియో కాల్‌లో డాక్టరుతో మాట్లాడవచ్చు.
 
ధనీ హెల్త్‌కేర్ ప్రెసిడెంట్ నిఖిల్ చారీ ఇలా అన్నారు, "రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికీ ఈ కిట్ సహాయపడుతుంది మరియు ఏ వ్యక్తికైనా జ్వరం, దగ్గు లేదా గొంతు ఇన్ఫెక్షన్ లాంటి లక్షణాలు ఏవైనా కలిగితే కోవిడ్‌కి ప్రారంభ సంరక్షణగా ఈ మందులు ఉపయోగించవచ్చు. ఏదైనా సహాయం కోసం ఉచిత వీడియో కన్సల్టేషన్‌ల కోసం ధనీ డాక్టరుతో కూడా ప్రజలు కనెక్ట్ అవ్వవచ్చు.''
 
ధనీ హెల్త్‌కేర్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా. స్మితా దశ్ ఇలా అన్నారు, "ఈ కిట్ కోవిడ్ సంరక్షణకు ప్రత్యామ్నాయం కాదు, కానీ కోవిడ్‌కి ప్రారంభ రోగనిరోధక సంరక్షణగా సహాయపడుతుంది. వైరల్ ఇన్ఫెక్షన్‌లన్నిటిపై పోరాడేందుకు రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది.''
 
ఈ కార్యక్రమాన్ని 'ధనీ ఆప్‌కే సాథ్' అని పిలుస్తారు మరియు ఈ కార్యక్రమానికి మరింతగా మద్దతు ఇచ్చేందుకు, ధనీ యాప్‌లో పగలైనా లేదా రాత్రయినా డాక్టర్లకు వీడియో కాల్ చేయడం ద్వారా ఉచిత కన్సల్టేషన్ పొందేందుక డాక్టర్ల ప్యానల్‌ని కూడా ధనీ అందుబాటులో ఉంచింది.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాష్ట్రానికి కొత్తగా మరో 3 ఐఎస్‌వో ట్యాంకులు, కోవిడ్ టాస్క్‌ఫోర్స్ కమిటీ చైర్మన్ కృష్ణబాబు