Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెద్దిరెడ్డి ఇలాకాలో జారుకుంటున్న వైకాపా నేతలు.. టీడీపీలో చేరేందుకు సిద్ధం!!

వరుణ్
శుక్రవారం, 5 జులై 2024 (12:03 IST)
వైకాపా సీనియర్ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత జిల్లా చిత్తూరు జిల్లాలో వైకాపాకు చెందిన నేతలు మెల్లగా పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారు. గత ఐదేళ్లపాటు తమ కన్నుసన్నలతో జిల్లా మొత్తాన్ని శాసించిన పెద్దిరెడ్డి... ఇపుడు చేజారిపోతున్న నేతలను కాపాడుకునే పనిలో నిమగ్నమయ్యారు. తాజాగా చిత్తూరు జిల్లా కార్పొరేషన్‌లో వైకాపాకు భారీ షాక్ తగిలింది. నగర మేయర్ అముద, డిప్యూటీ మేయర్ రాజేశ్ రెడ్డితో పాటు పలువురు కార్పొరేటర్లు వైకాపాను వీడి టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. 
 
శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ఆధ్వర్యంలో వీరంతా టీడీపీ కండువా కప్పుకునేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీంతో వైకాపా కార్పొరేటర్లు టీడీపీలోకి చేరడంతో వైకాపా పాలకవర్గం పదవిని కోల్పోయే ప్రమాదం ఉంది. దీన్ని వైకాపా నేతలు ముఖ్యంగా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన తనయుడు, రాజంపేట వైకాపా ఎంపీ మిథున్ రెడ్డిలు ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. పార్టీ నేతలు చేజారిపోకుండా చర్యలు చేపట్టారు. అయితే, అనేక ప్రాంతాల్లో వైకాపా నేతలు మాత్రం పార్టీ మారేందుకే సిద్ధమయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానుల రుణం ఈ జన్మలో తీర్చుకోలేను : జూనియర్ ఎన్టీఆర్

మహేష్ బాబు ఆవిష్కరించిన మా నాన్న సూపర్ హీరో ట్రైలర్‌

యూట్యూబర్ హర్ష సాయిపై లుకౌట్ నోటీసులు జారీ.. ఎందుకంటే?

విజువ‌ల్ గ్రాఫిక్స్‌ హైలైట్ గా శ్ర‌ద్ధాదాస్ త్రికాల చిత్రం

అమ్మ‌లాంటి వైద్యం హోమియోపతి అందుకే కాదంబ‌రి హోమియోపతి క్లినిక్ ప్రారంభించాం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తేనె మోతాదుకి మించి సేవిస్తే జరిగే నష్టాలు ఏమిటి?

గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించుకునేదెలా?

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

తర్వాతి కథనం
Show comments