Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వెళ్లేవారు వెళ్ళిపోనివ్వండి.. ఎవరిష్టం వారిది : నేతలతో మాజీ సీఎం జగన్

jagan with leaders

వరుణ్

, గురువారం, 4 జులై 2024 (09:34 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలిలో వైకాపా ఎక్కువగా సంఖ్యాబలం ఉంది. ఇపుడు వైకాపా అధికారం కోల్పోవడంతో పెక్కుమంది ఎమ్మెల్సీలు టీడీపీ లేదా జనసేన, బీజేపీల్లో చేరే అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇదే అంశాన్ని బుధవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జగన్‌ను కలిసిన పలువురు నేతలు అభిప్రాయం వ్యక్తంచేశారు. దీనిపై జగన్ స్పందిస్తూ, 'వెళ్లిపోవాలనుకునేవారిని ఎంతకాలం ఆపగలం, అది వారిష్టం.. విలువలు, నైతికత అనేవి వారికి ఉండాలి. వెళ్లేవారు వెళతారు. బలంగా నిలబడగలిగేవారే నాతో ఉంటారు. పార్టీలో నేను, అమ్మ ఇద్దరమే మొదలై ఇంత దూరం వచ్చాం. ఇప్పుడూ మళ్లీ మొదటి నుంచి ప్రారంభిద్దాం. ఇబ్బందేమీ లేదు' అంటూ నైరాశ్యంతో వ్యాఖ్యానించారు. 
 
'శాసనమండలిలో వైకాపాకు సంఖ్యా బలం ఉంది. అయితే కూటమి ప్రభుత్వం వైపు కొందరు సభ్యులు వెళ్లే అవకాశం ఉండొచ్చు, ఇప్పటికే కొందరికి ఫోన్లు వచ్చి ఉంటాయి' అని పార్టీ నేతలతో జగన్ అన్నారు. ఈ మాటలపై ఈ సందర్భంగా చర్చ జరిగింది. దీనిపై జగన్ స్పందిస్తూ, 'గతంలో 23 మంది ఎమ్మెల్యేలు వెళ్లారు. వాళ్లలో ఎంత మంది ఇప్పుడు అధికారంలో ఉన్నారు? అటూ ఇటూ వెళ్లేవారు ఎటూ కాకుండా పోతారు. ఎవరిష్టం వారిది' అని వ్యాఖ్యానించినట్లు సమాచారం. తమ నియోజకవర్గాల్లో పరిస్థితులపై కొందరు నేతలు వివరించగా.. వెనక్కి తగ్గకూడదు, మళ్లీ ముందుకు కదలాలని ఆయన సూచించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నేడు ప్రధాని మోడీతో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం!!