Webdunia - Bharat's app for daily news and videos

Install App

సమాధి తవ్వుకుని అందులోనే అన్న‌దాత‌ల వినూత్న నిర‌స‌న‌

Webdunia
శనివారం, 18 సెప్టెంబరు 2021 (10:00 IST)
రైతుల నుంచి భూములు బలవంతంగా గుంజటానికి ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రయత్నిస్తూనే ఉన్నాయి. ఆర్థిక, రాజకీయ వత్తిళ్లకు తలొగ్గి భూములు వదులుకుంటున్న అన్నదాతలెందరో. 
 
తాజాగా యూపీలో కూడా భూసేకరణ చేయాలని యోగి సర్కార్‌ నిర్ణయించింది. ఘజియాబాద్‌లోని మండోలా విహార్‌ పథకం ద్వారా అభివృద్ధి పనుల‌కు వ్యతిరేకంగా ఆరు గ్రామాలకు చెందిన రైతులు భూ సమాధి ఉద్య‌మాన్ని చేపట్టారు.
 
సమాధిలా తవ్వి అన్నదాతలు అందులో కూర్చున్నారు. తమకు పరిహారంతో పాటు, ఇతర పునరావాస కార్యక్రమాలు చేపట్టేదాక సమాధి నుంచి బయటకు రామని కరాఖండిగా చెబుతున్నారు.
 
2016 డిసెంబర్‌ 2న మండోలా సహా ఆరు గ్రామాల రైతులు 2013 భూసేకరణ చట్టం ప్రకారం భూమికి పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ నిరసన ప్రారంభించారు. ఇపుడు వినూత్నంగా సమాధి తవ్వుకుని ఆందోళనకు దిగటం విశేషం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓ హీరో ఇబ్బందికరంగా ప్రవర్తించారు.. : సినీ నటి ఖుష్బూ

డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ కానున్న హరికథ వెబ్ సిరీస్

ఖర్చుపెట్టినా దక్కని ఫలితంతో ఎస్కేప్ అయిన నిర్మాత

ఎస్ఎస్ థమన్ లాంచ్ చేసిన అల్లరి నరేష్, అమృత అయ్యర్ బచ్చల మల్లి మెలోడీ సాంగ్

కన్నప్ప లో మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

క్యాబేజీతో బిర్యానీ.. పెరుగు పచ్చడితో టేస్ట్ చేస్తే.. అదిరిపోతుంది...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments