Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నేషనల్ ఖో ఖో ప్లేయర్‌పై అత్యాచారం... నోట్లో పళ్లు రాలగొట్టి రైలు పట్టాలపై...

Advertiesment
Audio Clip
, బుధవారం, 15 సెప్టెంబరు 2021 (09:18 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బిజ్నోర్‌లో ఓ దారుణం జరిగింది. 23 యేళ్ళ జాతీయ ఖో ఖో క్రీడాకారిణిపై అత్యాచారం జరిగింది. ఉద్యోగ ఇంటర్వ్యూకు వెళ్లి ఇంటికి వెళుతున్న ఈ యువతిపై... ఓ దుండగుడు కిడ్నాప్ చేసి అత్యాచారం చేశాడు. ఆ తర్వాత ఆమె చున్నీతోనే మెడకు ఉరి బిగించి హత్య చేశాడు. శవాన్ని రైలు పట్టాలపై పడేసి వెళ్లిపోయాడు. వెళ్లిపోయేముందు.. ఆమె నోట్లో పళ్లన్నీ రాలగొట్టాడు. ఇలా అత్యంత క్రూరంగా చంపేశాడు. ఈ దారుణం ఈ నెల 10వ తేదీన జరిగింది.
 
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, బిజ్నోర్‌కు చెందిన 23 యేళ్ల నేషనల్ ఖో ఖో ప్లేయర్‌గా ఉన్నారు. పైగా, ఈమె ఉపాధి వేటలో నిమగ్నంకాగా, ఈ నెల 10వ తేదీన ఓ ఉద్యోగ ఇంటర్వ్యూకు వెళ్ళి ఇంటికి తిరిగి బయలుదేరింది. ఈ క్రమంలో ఓ దుండగుడు రేప్‌ చేసి ఆమె చున్నీతోనే ఉరి బిగించి రైలు పట్టాలపై పడేసి వెళ్లిపోయాడు. 
 
మొఖం గుర్తు పట్టకుండా దారుణంగా హింసించాడు. నోట్లో పళ్లు లేకుండా రాలగొట్టాడు. క్రూరంగా చంపి రైలు పట్టాలపై పడేసి  పరారయ్యాడు. ఆమె ఫోన్ తీసుకుని వెళ్లాడు. ఈ దారుణ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తొలుత హత్య కేసుగా నమోదు చేశారు. అయితే, ఈ ఘటన జరిగిన సమయంలో ఆమె ఫోన్‌లో మాట్లాడుతోంది. అది గమనించని నిందితుడు ఆమెపై అటాక్ చేశాడు. 
 
ఆ రాక్షసుడు అకృత్యానికి పాల్పడిన సమయంలోనూ ఫ్రెండ్ తో ఫోన్‌ కాల్ కొనసాగుతూనే ఉంది. ఆ సమయంలో ఆమె సాయం కోసం కేకలు వేసిన తీరు కలిచి వేస్తోంది. ఒక నిమిషం 41 సెకన్ల పాటు రికార్డ్ అయింది. ఈ ఆడియో క్లిప్‌ను పోలీసులకు అందజేశాడు. దీని సాయంతో ఆమె ఫోన్ కోసం పోలీసులు కేసు ఛేదించారు. ఘటన సమయంలో మిస్‌ అయిన ఆమె ఫోన్‌.. ట్రేస్ చేయాలన్న ఆలోచన వచ్చింది. దీంతో నిందితుడు షాజద్‌ అలియాస్ హమీద్‌ను పోలీసులు అరెస్టు చేశారు.
 
అతడు ఒక రైల్వే లేబర్ అని, డ్రగ్‌ అడిక్ట్ అని, ఇప్పటికే నాలుగు కేసులు ఉన్నాయని పోలీసులు చెప్పారు. క్రైమ్‌ స్పాట్‌లో అతడి షర్ట్ బటన్ దొరికిందన్నారు. అలాగే అతడి షర్ట్‌పైనా రక్తపు మరకలు ఉంటే నిందితుడి భార్య ఉతికేసిందన్నారు. అయితే నిందితుడిని పరిశీలించగా అతడి శరీరంపై బాధితురాలు ఆ నిస్సహాయ స్థితిలో గోళ్లతో రక్కి తప్పించుకునే ప్రయత్నం చేసిన ఆనవాళ్లు గుర్తించామని, దీంతో ఆ శాంపిల్‌ను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపగా అది బాధితురాలి డీఎన్‌ఏతో మ్యాచ్‌ అయిందని చెప్పారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సగంలో కండోమ్ తీస్తే శిక్షే.. అమెరికాలో సరికొత్త బిల్లు