Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు లోగిళ్ళలో భోగి సంబరాలు... నేతల శుభాకాంక్షలు

Webdunia
శుక్రవారం, 14 జనవరి 2022 (08:22 IST)
తెలుగు ప్రజలకు అతి ప్రధానమైన పండుగ సంక్రాంతి. ఇందులో తొలి రోజు జరుపుకునే పండుగ భోగి. ఈ పండుగను శుక్రవారం తెలుగు ప్రజలంతా జరుపుకుంటున్నారు. ఈ పండుగను పురస్కరించుకుని తెలుగు ప్రజలంతా వేకువజామునే భోగి మంటలు వేశారు. 
 
దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పండుగ శోభ సంతరించుకుంది. వీధుల్లో రంగవల్లులు, గంగిరెద్దుల విన్యాసాలు, భోగి మంటల వద్ద పిల్లలు, పెద్దల కేరింతలు వేస్తూ ఎంతో ఉత్సాహంగా ఎంజాయ్ చేస్తున్నారు. భోగి మంటల వద్ద చిన్నారుల కోలాటాలతో ఆడిపాడారు. హరిదాసుల కీర్తనలతో సందడి వాతావరణం నెలకొంది. 
 
ఇదిలావుంటే, సంక్రాంతి పండుగను పురస్కరించుకుని రాజకీయ నేతలు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ ఏపీ శాఖ చీఫ్ సోము వీర్రాజు, ఇతర పార్టీల నేతలతో పాటు రాష్ట్ర గవర్నర్ హరిచందన్‌లు శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు వారి ముఖ్యమైన పండుగ సంక్రాంతి, తెలుగు ప్రజలంతా ఆనందంగా జరుపుకోవాలని వారు కోరారు.
 
కాగా, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సంక్రాంతి పండుగ కోసం చెన్నైకు వచ్చారు. ఆయన ఈ నెల 16వ తేదీన నెల్లూరు జిల్లాలోని తన స్వగ్రామానికి చేరుకున్నారు. చెన్నై కొట్టూరుపురంలో ఉన్న ఆయన నివాసంలో వెంకయ్య దంపతులు సంక్రాంతి పండుగను జరుపుకుంటారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నెట్‌ఫ్లిక్స్ సంస్థపై ధనుష్ కేసు.. మద్రాస్ హైకోర్టులో పిటిషన్

వీకెండ్ సినిమా మొదటి షెడ్యూల్ చీరాల లో ప్రారంభం

త్రిగుణ్ కెరీర్ కు టర్నింగ్‌ పాయింట్‌ కావాలి : అల్లరి నరేశ్

నా ద్రుష్టిలో` డాన్స్ కింగ్ అల్లు అర్జున్ - పుష్ప 2 సాంగ్ కు నో ఫీజ్ : శ్రీలీల స్టేట్ మెంట్

చివరి రోజు.. చివరి షాట్... ఎంత అద్భుతమైన ప్రయాణం : అల్లు అర్జున్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments