Webdunia - Bharat's app for daily news and videos

Install App

మచిలీపట్నం బెల్‌లో బీటెక్ అర్హతతో ఉద్యోగాలు

Webdunia
ఆదివారం, 20 నవంబరు 2022 (13:31 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మచిలీపట్నంలో ఉన్న భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో బీటెక్ అర్హతతో ఒప్పంద ప్రాతిపదికపై ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ.55 వేల వరకు వేతనం చెల్లించనున్నారు. అభ్యర్థుల ఎంపికలో అనుభవాన్ని ప్రామాణికంగా తీసుకోనున్నారు. 
 
మొత్తం 37 ప్రాజెక్టు ఇంజనీర్, ట్రైనీ ఇంజనీర్ పోస్టులను భర్తీ చేయడానికి అర్హుల నుంచి దరఖాస్తులను అహ్వానిస్తుంది ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్శిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుంచి సంబంధిత స్పెషలైజేషన్‌ విభాగంలో బీఈ, బీటెక్, బీఎస్సీ లేదా తత్సమాన కోర్సులో 55 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత రంగంలో అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుందని తెలిపింది. 
 
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 2022 అక్టోబరు ఒకటో తేదీ నాటికి 28 నుంచి 37 యేళ్ల మధ్య ఉండాలని తెలిపింది అర్హత గల అభ్యర్థులు ఈ నెల 26వ తేదీలోపు దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. 
 
జనరల్ కేటగిరీ అభ్యర్థులు ట్రైనీ ఇంజనీర్ పోస్టులకు రూ.177, ప్రాజెక్టు ఇంజనీర్ పోస్టులకు రూ.472 చొప్పున దరఖాస్తు ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, వికలాంగ అభ్యర్థులు ఫీజు చెల్లించాల్సిన అక్కర్లేదు. 
 
రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక ఉంటుంది. ప్రాజెక్టు ఇంజనీర్లకు మొదటి యేడాది రూ.30 వేలు, రెండో యేడాది రూ.35 వేలు, మూడో యేడాది రూ.40 వేలు చొప్పున నెలకు చెల్లిస్తారు. 
 
ఇందులో 7 ఎలక్ట్రానిక్స్ కేటగిరీలో ప్రాజెక్టు ఇంజనీర్ పోస్టులు, 7 మెకానికల్ ప్రాజెక్టు ఇంజనీర్ పోస్టులు, 11 ఎలక్ట్రానిక్స్ ట్రైనీ ఇంజనీర్ పోస్టులు, 10 మెకానికల్ ట్రైనీ ఇంజనీర్ పోస్టులు, 2 కంప్యూటర్ సైన్స్ ట్రైనీ ఇంజనీర్ పోస్టులను భర్తీ చేస్తారు. 

సంబంధిత వార్తలు

తల్లిదండ్రులు పిల్లలకు చూపించాల్సిన చిత్రం ప్రేమించొద్దు : చిత్రయూనిట్

ప్రేమ కథతో పాటుగా మర్డర్, క్రైమ్ మిస్టరీ చిత్రమే నింద టీజర్ : నవీన్ చంద్ర

ఫ్యాన్స్ షాక్: కుడిచేతికి కట్టు వేసుకుని కేన్స్ ఫిలిమ్ ఫెస్టివల్‌కి ఐశ్వర్యా రాయ్ - video

ఎం.ఎల్.ఎ.లను కిడ్నాప్ చేసిన రామ్ చరణ్ - తాజా అప్ డేట్

దేవర లో 19 న ఎర్రసముద్రం ఎగిసెగిసిపడుద్ది : రామ జోగయ్యశాస్త్రి

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments