Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లికి భారత సైన్యానికి ఆహ్వానం... శుభాకాంక్షలు తెలిసిన సైనికులు

Webdunia
ఆదివారం, 20 నవంబరు 2022 (12:43 IST)
కేరళకు చెందిన రాహుల్, కార్తీక అనే యువతీయువకులు ఈ నెల 10వ తేదీన వివాహం చేసుకున్నారు. అయితే, ఈ వివాహానికి ముందు తమ పెళ్లికి రావాలని విజ్ఞప్తి చేస్తూ వారు భారత ఆర్మీని ఆహ్వానించింది. తమ పెండ్లి పత్రికను ఆర్మీకి పంపించింది. ఇందులో... 
 
"ప్రియమైన హీరోలకు..." అంటూ సైనికులను సంబోధిస్తూ, మీ ప్రేమ, దేశంపై మీకున్న భక్తి, విధి నిర్వహణలో మీరు చూపించే సాహసానికి మేమెంతో రుణపడి పోయామని ఆ జంట పేర్కొంది. 
 
"సరిహద్దుల్లో కాపలా కాస్తూ మమ్మల్ని జాగ్రత్తగా కాపాడుతున్నందుకు, మా జీవితాలను సంతోషంగా ఉంచుతున్నందుకు మీకు ధన్యవాదాలు. మా పెళ్ళికి హాజరై మమ్మల్ని దీవించండి" అంటూ ఆ జంట పంపిన ఆహ్వాన పత్రికలో పేర్కొంది. 
 
కాగా, ఈ వివాహ ఆహ్వాన పత్రికపై ఇండియన్ ఆర్మీ అధికారులు స్పందించారు. పెళ్లి పత్రికను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి... పెళ్లికి పిలిచినందుకు ధన్యవాదాలు. భారత సైన్యం మీ జంటకు ఆశీస్సులు తెలియజేస్తుంది. మీ వైవాహిక జీవితం సంతోషంగా సాగిపోవాలని కోరుకుంటూ అభినందనలు తెలియజేస్తుంది" అని అధికారులు రిప్లై ఇచ్చారు. 
 
ఈ పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇప్పటివరకు తాము చూసిన పెళ్లి ఆహ్వాన పత్రికల్లో ఇదే ది బెస్ట్ ఇన్విటేషన్ అంటూ పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏడాది క్రితం ట్వీట్స్ పెడితే ఇప్పుడు మనోభావాలు దెబ్బతినడం ఏంటి: వర్మ లాజిక్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అఖిల్ అక్కినేని, జైనాబ్ రావ్‌జీల నిశ్చితార్థం చేశామన్న నాగార్జున

రోటి కపడా రొమాన్స్‌ బాగా లేదంటే సినిమాలకు రిటైర్‌మెంట్‌ : దర్శకుడు విక్రమ్‌ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments