Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికాలో తెలుగు విద్యార్థి అనుమానాస్పద మృతి!!

Webdunia
ఆదివారం, 12 మార్చి 2023 (10:27 IST)
ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లిన తెలుగు విద్యార్థి ఒకరు అనుమానాస్పదంగా కన్నుమూశారు. అయితే, ఆయన్ను హత్య చేశారా? లేక ఆత్మహత్య చేశారా? అనే విషయంపై స్పష్టత రావాల్సివుంది. ఈ వివరాలను పరిశీలిస్తే,
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బాపట్ల జిల్లా మార్టూరు మండలం జొన్నతాళికి చెందిన గోవాడ నాగసాయి గోపి అరుణ్‌కుమార్‌ (23)కు ఉన్నతవిద్యపై ఉన్న మక్కువను గుర్తించిన తల్లిదండ్రులు.. తమ ఆస్తులను కుదువ పెట్టి మరీ అమెరికాలో ఎంఎస్‌ చేసేందుకు ఏడు నెలల క్రితం పంపించారు. 
 
అక్కడికి వెళ్లిన అరుణ్‌కుమార్‌ ఈ నెల ఒకటి నుంచి కనిపించడంలేదని స్నేహితులు అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 4వ తేదీన అతను ఉండే నివాసానికి సమీపంలోని సరస్సులో అరుణ్‌ మృతదేహం పోలీసులకు లభించిందని సన్నిహితులు వెల్లడించారు. మృతదేహానికి అమెరికా పోలీసులు శవపరీక్షలు నిర్వహించి, అక్కడి స్నేహితుల సహకారంతో స్వదేశానికి పంపించారు. 
 
కుమారుడి భౌతిక కాయాన్ని చూసిన తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. పేద కుటుంబంలో జన్మించినా.. చదువులో రాణించిన కుమారుడికి విదేశాల్లో ఉన్నతవిద్యను అందించాలన్న వారి కలలు గల్లంతయ్యాయి. కన్న కొడుకు నిర్జీవంగా ఇంటికి రావడంతో ఆ కుటుంబీకులు తట్టుకోలేకపోతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments