Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గాలి వేగంలో మార్పులు... విమానంలో కుదుపులు.. ప్రయాణికుడు మృతి

Advertiesment
plane
, ఆదివారం, 5 మార్చి 2023 (13:44 IST)
గగనతలంలోని గాలి వేగంలో ఆకస్మికంగా మార్పులు (టర్బులెన్స్) చోటుచేసుకున్నాయి. దీంతో నింగిలో వెళుతున్న విమానం ఒకటి భారీ కుదుపులకు లోనైంది. ఈ టర్బులెన్స్ కారణంగా విమానం భారీ కుదుపులకు లోనైనపుడు కొన్ని సమయాల్లో ప్రయాణికులు గాయాలపాలవుతుంటారు. మిస్సోరీలోని కాన్‌క్సాన్ సంస్థకు చెందిన తేలికపాటి విమానంలో ఈ ఘటన వెలుగు చూసింది. ప్రమాద సమయంలో విమానంలో ఆరుగు ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం. 
 
ఈ విమానం కీన్ ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరిన విమానం 20 నిషాలకే బ్రాడ్లే విమానాశ్రయంలో అత్యవసరంగా లాండైంది. అప్పటికే అక్కడకు చేరుకున్న ప్యాసింజర్లను ఆస్పత్రికి తరలించారు. అయితే, ప్రయాణికుడు ఎలా మరణించాడో ఇపుడే చెప్పలేమని అమెరికా నేషనల్ ట్రాన్స్‌పోర్టు సేఫ్టీ బోర్డు ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించిన ఎన్.టి.ఎస్.బి... విమానంలో బాక్స్, కాక్‌పిట్ వాయిస్ రికార్డర్‌ను స్వాధీనం చేసుకుంది. ఈ ఘటనకు పూర్తి విమరాలు తెలుసుకునేందుకు విమాన సిబ్బంది, ఇతర ప్రయాణికులను ప్రశ్నిస్తుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కొడుకు కాపీ కొట్టేందుకు సాయం చేసిన తండ్రి.. పోలీసులు చితక్కొట్టారు...