Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య హత్యకు భర్త వేసిన స్కెచ్ తెలిస్తే షాకే..?

Bank manager
Webdunia
మంగళవారం, 4 ఫిబ్రవరి 2020 (13:36 IST)
కట్టుకున్న భర్తే కాలయముడయ్యాడు. సైనైడ్ ఇచ్చి గుట్టుచప్పుడు కాకుండా చంపేశాడు. మదనపల్లిలో జరిగిన ఈ దారుణం తెలుగు రాష్ట్రాల ప్రజలు ఉలిక్కిపడ్డారు. ఎవరికీ అనుమానం రాకుండా చాకచక్యంగా భార్యను చంపాడు.

పోలీసులు రంగప్రవేశం చేయడంతో అసలు విషయం బయటపడింది. గత నెల 27వ తేదీన అనుమానాస్పద స్థితిలో జరిగిన మృతి కేసును ఛేదించారు పోలీసులు. చివరకు భర్తను, అతని తల్లిదండ్రులను అరెస్ట్‌ చేశారు. 
 
కృష్ణా జిల్లాకు చెందిన లక్ష్మీదేవి, జోగినాయుడు కుమార్తె ఆమనిని మదనపల్లెలో బ్యాంక్‌ ఆఫ్ బరోడా మేనేజర్‌గా పని చేస్తున్న రవిచైతన్యతో వివాహం జరిపించారు. గత నెల 27వ తేదీన ఆమని స్పృహ తప్పి పడిపోయిందని ఆమె భర్త రవిచైతన్య ఆమనిని జిల్లా ఆసుపత్రికి తరలించాడు. అయితే చికిత్స పొందుతూ ఆమని మృతి చెందింది. 
 
తమ కుమార్తెను రవిచైతన్య, వారి తల్లిదండ్రులు హత్య చేశారని ఆమని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆమని మృతదేహాన్ని పోస్టుమార్టం చేయగా ఆమనికి సైనైడ్ ఇచ్చినట్లు నిర్ధారణ కావటంతో పోలీసులు రవిచైతన్యను, అతని తల్లిదండ్రులను అరెస్ట్ చేశారు.
 
మదనపల్లిలో ఆమని హత్య విషయాన్ని ఛేదించిన పోలీసులు రవిచైతన్య అకృత్యాలను వివరించారు. కట్నం తక్కువుగా ఇచ్చారని కొంతకాలంగా ఆమనని వేధింపులకు గురిచేస్తున్నాడని డీఎస్పీ తెలిపారు. రవిచైతన్యకు వివాహేతర సంబంధం ఉందని ఆమని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందనే కారణంగా వేధింపులకు గురిచేసి ఆమనిని చంపేశాడని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi: ఎ.ఆర్.రెహమాన్ మిక్సింగ్ పూర్తి - పెద్ది ఫస్ట్ షాట్‌ సిద్ధం

Trivikram Srinivas: ఆయన నిజంగానే జైంట్ : త్రివిక్రమ్ శ్రీనివాస్

NTR: రావణుడి కంటే రాముడి పాత్ర కష్టం, అందుకే అదుర్స్ 2 చేయలేకపోతున్నా : ఎన్టీఆర్

Sampoornesh: రాజమౌళి గారి పలకరింపే నాకు ధైర్యం : సంపూర్ణేష్ బాబు

Urvashi Rautela : దబిడి దిబిడి తర్వాత ఊర్వశి రౌతేలా సన్నీ డియోల్ జాట్ లో అలరిస్తోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments