Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేసీఆర్.. ఓ దద్దమ్మ : బండారు దత్తాత్రేయ

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీమంత్రి బండారు దత్తాత్రేయ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కేసీఆర్ ఓ దద్దమ్మ అంటూ దత్తాత్రేయ ధ్వజమెత్తారు.

Webdunia
శుక్రవారం, 2 మార్చి 2018 (11:41 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీమంత్రి బండారు దత్తాత్రేయ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కేసీఆర్ ఓ దద్దమ్మ అంటూ దత్తాత్రేయ ధ్వజమెత్తారు. ఇటీవల కేసీఆర్ ఓ బహిరంగ సభలో ప్రసంగిస్తూ, రూ.లక్షన్నర కోట్ల రాష్ట్ర బడ్జెట్‌లో వ్యవసాయానికి రూ.10 వేల కోట్లు కూడా కేటాయించలేని దద్దమ్మలు కేంద్ర ప్రభుత్వాన్నే ప్రశ్నిస్తారా? అంటూ విరుచుకుపడ్డారు. 
 
ఈ వ్యాఖ్యలపై బండారు దత్తాత్రేయ స్పందించారు. దేశంలో రైతన్నల ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి కేంద్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని... అలాంటి బీజేపీ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీతో పోలుస్తారా? అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రం నుంచి మంత్రులు ఎవరైనా సరే ఢిల్లీ వెళ్తే... కేంద్ర మంత్రులు వేల కోట్ల రూపాయలను కేటాయిస్తున్నారని ఆయన గుర్తుచేశారు.
 
ప్రధానిగా నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చాకే దేశంలో రైతులు పచ్చగా ఉన్నారనీ తెలిపారు. రైతుల సంక్షేమం గురించి ఆలోచన చేసే ఏకైక ప్రభుత్వం బీజేపీ సర్కారు అని బండారు చెప్పుకొచ్చారు. అదేసమయంలో తెలంగాణ రాష్ట్రంలోని రైతుల పరిస్థితి ఎలా ఉందో ఓ సారి తెలుసుకోవాలని సీఎం కేసీఆర్‌కు సూచించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

త్రిబాణధారి బార్బరిక్ లో ఉదయ భాను స్టెప్పులు స్పెషల్ అట్రాక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments