Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాజీ సీఈసీ మృతిపట్ల గవర్నర్ బండారు సంతాపం

Webdunia
శుక్రవారం, 16 ఏప్రియల్ 2021 (14:49 IST)
కేంద్ర ఎన్నికల సంఘం మాజీ కమిషనర్ గాలి వెంకట గోపాల కృష్ణమూర్తి మృతి పట్ల హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ సంతాపాన్ని వ్యక్తం చేశారు. జీవీజీ కృష్ణమూర్తి మృతి తనను బాధను కలిగించిందన్నారు. న్యాయవాదిగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో, సుప్రీంకోర్టులో ఎన్నో కీలక కేసులను వారు వాదించారని తెలిపారు. గతంలో వారు భారతీయ న్యాయ సంఘంలో మెంబర్ సెక్రటరీగా విధులు నిర్వర్తించారని, కేంద్ర ఎన్నికల సంఘం కమిషనరుగా కూడా పనిచేశారని వారి సేవలను దత్తాత్రేయ గుర్తుచేసుకున్నారు. 

1992లో తానూ పార్లమెంట్ సభ్యునిగా ఉన్నప్పుడు గాలి వెంకట గోపాల కృష్ణమూర్తితో తనకు వారితో అనుబంధం ఏర్పడిందని, తాను  కేంద్ర మంత్రిగా ప్రాతినిధ్యం వహించినప్పుడు తనకు కృష్ణమూర్తి అనేకమైన సలహాలు సూచనలు అందించేవారని, మృదుస్వభావి, స్నేహశీలి అయిన కృష్ణమూర్తి సేవలు ఎనలేనివని బండారు దత్తాత్రేయ కొనియాడారు. ఆ మహానుభావుడి మరణం పట్ల వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నట్లు, వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు బండారు దత్తాత్రేయ తెలియజేశారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments