సీనియర్లంటే ఆయనకు లెక్కలేదు.. పదవులు కాదు.. విలువలు ముఖ్యం : బాలినేని (Video)

ఠాగూర్
శుక్రవారం, 27 సెప్టెంబరు 2024 (07:57 IST)
పార్టీలోని సీనియర్లన్నా.. వారు ఇచ్చే సూచనలన్నా వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డికి ఏమాత్రం లక్కేలేదని ఆ పార్టీ నుంచి రాజీనామా చేసి జనసేన పార్టీలో చేరిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి ఆరోపించారు. బాలినేనితో పాటు పలువురు వైకాపా నేతలు గురువారం జనసేన పార్టీ అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. ఆ తర్వాత బాలినేని మీడియాతో మాట్లాడారు. 
 
తాను మొదటి నుంచి విలువలతో కూడిన రాజకీయాలు చేశానని, తాను జనసేన పార్టీలో చేరడం వల్ల ఒంగోలులో కూటమికి ఇబ్బంది రాదని స్పష్టం చేశారు. ఇటీవల చిన్న చిన్న వివాదాలు వచ్చాయని, అవన్నీ సర్దుకుంటాయన్నారు. ప్రకాశం జిల్లాలో జనసేనను బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని బాలినేని పేర్కొన్నారు.
 
అదేసమయంలో వైఎస్ జగన్ తీరుపైనా తీవ్ర విమర్శలు గుప్పించారు. 'జగన్మోహన్ రెడ్డికి మాలాంటి సీనియర్ నేతలంటే అసలు లెక్క లేదు. నేను వైయస్సార్‌కు వీరాభిమానిని. ఆయన అడుగుజాడల్లో పని చేశాను. జగన్మోహన్ రెడ్డి ఏక పక్ష నిర్ణయాలు మా మనసుకు కష్టం కలిగించాయి. నాకు పదవులు ముఖ్యం కాదు. విలువ, గౌరవం ముఖ్యం. నన్ను నమ్ముకున్న వాళ్ల కోసం నేను పని చేస్తా. 
 
రెండోసారి మంత్రి వర్గ విస్తరణలో అందరనీ మారుస్తాం అన్నారు. మాలాంటి కొంతమందిని మార్చి మమ్మల్ని అవమానించారు. మంత్రి పదవుల్లో కొనసాగించిన వాళ్లు అంత గొప్పగా ఏం చేశారో.. మేమేం చేయలేదో జగన్‌కే తెలియాలి. ఆ తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి చర్యలు చాలా సందర్భాలలో నన్ను బాధించాయి. అవన్నీ గతం.. ఇప్పుడు మా అధినేత పవన్ కల్యాణ్. నా పార్టీ జనసేన. నాకు జనసేనలో అవకాశం ఇచ్చిన పవన్ కళ్యాణ్‌కు ధన్యవాదాలు. పార్టీ అభివృద్ధి కోసం నా వంతు కృషి చేస్తా' అని బాలినేని చెప్పుకొచ్చారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'మీసాల పిల్ల' ఫుల్ సాంగ్ వచ్చేసింది.. (వీడియో)

సిద్ధు గారూ, మీరు నిజ జీవితంలో ఉమనైజరా?: లేడీ జర్నలిస్ట్ ప్రశ్న, ఎక్కడికి పోతున్నారు? (video)

Rashmika : రష్మిక మందన్నా కు ప్రేమ పెండ్లి వర్కవుట్ కాదంటున్న వేణు స్వామి

Srileela: ఏజెంట్ మ్రిచిగా శ్రీలీల ఫస్ట్ లుక్ - కొత్త ట్విస్ట్

Vishnu Vishal: విష్ణు విశాల్... ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఆర్యన్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

వెల్లుల్లి పొట్టును సులభంగా తొలగించాలంటే... మైక్రో ఓవెన్‌లో?

హృద్రోగుల్లో అత్యధిక శాతం 50 ఏళ్ల లోపువారే: టాటా ఏఐజీ సర్వేలో వెల్లడి

సూపర్ ఫుడ్ క్వినోవా తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments