Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య బికినీ ధరించేందుకు ఏకంగా దీవినే కొనుగోలు చేసిన భర్త...

saudi al nadak
ఠాగూర్
శుక్రవారం, 27 సెప్టెంబరు 2024 (07:38 IST)
తన భార్య బికినీ ధరించడాన్ని నలుగురు చూస్తారని భావించిన ఓ భర్త.. ఏకంగా ఓ ఐలాండ్ (దీవి)నే కొనుగోలు చేశాడు. ఈ దీవి ఖరీదు రూ.418 కోట్లు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. దుబాయికి చెందిన కోటీశ్వరుడు ఒకరు ఈ పని చేశారు. ఈ వీడియోను సోషల్ మీడియా వేదికగా ఎప్పటికప్పుడు తన విలాసవంతమైన జీవితాన్ని షేర్ చేసే దుబాయికి చెందిన సౌదీ అల్ నదక్ అనే 26 ఏళ్ల మహిళ ఈ విషయాన్ని చెప్పింది. 
 
'మీరు బికినీ ధరించాలని కోరుకున్నారు... మీ మిలియనీర్ భర్త ఐలాండ్ కొనేశాడు' అని ఆమె పేర్కొంది. 'నా భర్త బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇదే' అనే పోస్టుపై క్యాప్షన్ ఇచ్చి ఇన్‌స్టాగ్రామ్ వేదికగా సౌదీ అల్ నదక్ ఈ వీడియోను షేర్ చేసింది. అయితే తన భర్త కొనుగోలు చేసిన ఐలాండ్‌కు సంబంధించిన వివరాలను ఆమె గోప్యంగా ఉంచారు. 
 
కాగా దంపతులు ఇద్దరూ ఛార్టెడ్ విమానంలో ప్రయాణించి ఐలాండ్‌కు చేరుకున్నట్టు వీడియోలో కనిపించింది. అందమైన బీచ్, ఆహ్లాదకరమైన వాతావరణ, రాళ్లు, కొబ్బరి చెట్లు, చుట్టూ పచ్చని వాతావరణం ఈ వీడియోలో ఆకట్టుకునేలా ఉన్నాయి.
 
తాను ఏకాంతంగా బికినీ ధరించేందుకు దీవిని కొనుగోలు చేసినట్టు ఆమె తెలిపింది. 2.5 మిలియన్లకు పైగా వ్యూస్ లభించిన ఈ వీడియోపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేశారు. చాలామంది విమర్శలు గుప్పించారు. డబ్బును వృథా చేయడమేనని పలువురు పేర్కొన్నారు. ఆమె విలాసవంతమైన జీవనశైలిని చాటిచెప్పుకోవడానికి ఇదొక మార్గమని కొందరు అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దర్శక దిగ్గజం భారతీరాజా కుమారుడు మనోజ్ హఠాన్మరణం

రామ్ చరణ్‌తో మళ్లీ రొమాన్స్ చేస్తారా? సమంత ఏం చెప్పిందో తెలుసా? (video)

Charan: రామ్ చరణ్ పుట్టినరోజున పెద్ది టైటిల్ ప్రకటిస్తారా? - తాజా అప్ డేట్

బ్యూటీ భామ నీలఖికి యంగ్ సెన్సేషన్ అవార్డ్

కన్నప్ప లో మల్లు పాత్రలో నటించిన రఘు బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

హెచ్ అండ్ ఎం నుంచి మహిళల కోసం సరికొత్త ఫ్యాషన్ దుస్తులు

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments