Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలయ్యా... అమాయకుడా... ఇప్పుడు గుర్తొచ్చిందా ఎన్టీఆర్ విగ్రహం: మంత్రి రోజా ఎద్దేవా

Webdunia
శనివారం, 28 మే 2022 (15:19 IST)
హిందూపురం ఎమ్మెల్యే, టాలీవుడ్ నటుడు బాలకృష్ణ శనివారం పెమ్మసాని థియేటర్‌లో టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ సీఎం నందమూరి తారక రామారావు జయంతి వేడుకల్లో పాల్గొన్నారు.


అభిమానులనుద్దేశించి ఆయన మాట్లాడుతూ, 2019 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి ఓటు వేసి ప్రజలు తప్పు చేశారన్నారు. ఒకే ఒక్క ఛాన్స్ అంటే ఓటు వేసారు. ఇప్పుడు అనుభవిస్తున్నారు, ఇకనైనా ఆలోచించి ఓటు వేయండి. అప్పుడు ఎక్కడున్నాం... ఇప్పుడు ఎక్కడున్నాం ఆలోచించుకోవాలంటూ వైసిపిపై ఘాటు వ్యాఖ్యలు చేసారు.

 
బాలయ్య వ్యాఖ్యలపై మంత్రి ఆర్.కె రోజా మండిపడ్డారు. 14 ఏళ్ల టీడీపీ హయాంలో ఒక్కసారి కూడా తన తండ్రి ఎన్టీఆర్‌ కోసం నిమ్మకూరు ముఖం చూడని బాలకృష్ణ ఇప్పుడు ఏదో చేస్తానని అంటున్నారు. నిమ్మకూరులో 30 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానని, నిమ్మకూరును టూరిస్ట్‌ స్పాట్‌గా అభివృద్ధి చేస్తానని చెప్పి ఎన్టీఆర్‌పై ఉన్న ప్రేమను సడన్‌గా బాలకృష్ణ చాటుకున్నారు.

 
ఇన్నాళ్లూ గుర్తు రాని ఎన్టీఆర్ ఇప్పుడు ఎందుకు వచ్చారో అని ఎద్దేవా చేసారు. ఎన్టీఆర్ కు తగు గుర్తింపు ఇచ్చింది ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ అనీ, ఒక జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టిన ఘనత ఆయనది అంటూ చెప్పారు రోజా. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఈ విషయంలో జగన్ మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు చెప్పాలని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

1991లో వీరరాజు కు ఏం జరిగింది?

హైదరాబాద్‌ లో అల్లు అర్జున్‌ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ పర్యవేక్షణలో అట్లీ

Ruchi Gujjar video రుచి గుజ్జర్ ఎద ఎత్తులపై ప్రధాని మోడి ఫోటోల దండ

Ratnam: వినోదంతో పాటు, సందేశం ఇవ్వాలనేది నా తపన : ఎ.ఎం. రత్నం

Pawan: మూర్తీభవించిన ధర్మాగ్రహం పవన్ కళ్యాణ్; ఐటంసాంగ్ వద్దన్నారు : ఎం.ఎం. కీరవాణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments