Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలయ్య చేయి మళ్లీ రఫ్ ఆడింది... నలుగురిపై చేయి చేసుకున్న సింహా

సింహాకు కోపమొస్తే అంతే... ఎంతమంది వున్నా... ఎన్ని కెమేరాలు తీస్తున్నా కోపమొస్తే అంతే... చేయి రఫ్ ఆడేస్తుంది. ఇదే జరిగింది. ఖమ్మం జిల్లా పర్యటనలో అసహనంతో పలుమార్లు అభిమానులుపై చేయి చేసుకున్నారు బాలయ్య.

Webdunia
బుధవారం, 3 అక్టోబరు 2018 (10:53 IST)
సింహాకు కోపమొస్తే అంతే... ఎంతమంది వున్నా... ఎన్ని కెమేరాలు తీస్తున్నా కోపమొస్తే అంతే... చేయి రఫ్ ఆడేస్తుంది. ఇదే జరిగింది. ఖమ్మం జిల్లా పర్యటనలో అసహనంతో పలుమార్లు అభిమానులుపై చేయి చేసుకున్నారు బాలయ్య. హీరో బాలకృష్ణ మరోసారి నలుగురు అభిమానులపై చేయి చేసుకున్నారు. ఖమ్మం జిల్లాలో విస్తృతంగా పర్యటిస్తున్న నందమూరి బాలకృష్ణ, మదిర నుంచి సత్తుపల్లి సభకు వెళ్లేందుకు వాహనాలతో ర్యాలీగా బయల్దేరారు. 
 
ఈ అభిమానులంతా ఆయనతో కరచాలనం, ఫోటోలు తీసుకునేందుకు ఎగబడ్డారు. ఈ సందర్భంలో నూతనకల్‌కు చెందిన నలుగురు అభిమానులు వాహనానికి అడ్డంగా నిల్చుని జై బాలయ్యా.... జై జై బాలయ్యా అంటూ అరుస్తూ బాలకృష్ణతో కరచాలనం చేసేందుకు ప్రయత్నించారు. 
 
వారి అరుపులకు, వాహనానికి అడ్డుగా నిలబడటం చూసి కోపం వచ్చేసిన బాలయ్య తీవ్ర అసహనానికి గురై వాహనం దిగి... ఆ నలుగురు అభిమానులపై చేయిచేసుకున్నారు. దీంతో ఆగ్రహం చెందిన బాలకృష్ణ అభిమానులులు కోపోద్రిక్తులైన మిట్టపల్లి సెంటర్లో ఫ్లెక్సీలను చించి వాటిని దహనం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆంధ్రప్రదేశ్లో తెలుగు సినిమా పరిశ్రమ అభివృద్ధికి నూతన విధానం

Gowtam: మహేష్ బాబు కుమారుడు గౌతమ్ నటుడిగా కసరత్తు చేస్తున్నాడు (video)

Sapthagiri: హీరో సప్తగిరి నటించిన పెళ్లి కాని ప్రసాద్ రివ్యూ

Dabidi Dibidi : ఐటమ్ సాంగ్‌లో ఓవర్ డ్యాన్స్.. హద్దుమీరితే దబిడి దిబిడే..

UK-chiru: నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది’ - యునైటెడ్ కింగ్‌డమ్‌లో మెగాస్టార్ చిరంజీవి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

తర్వాతి కథనం
Show comments