బాలయ్య ఆ డైరెక్టరుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా..?
నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రస్తుతం ఎన్టీఆర్ బయోపిక్‌లో నటిస్తున్నారు. జాగర్లమూడి క్రిష్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం హైదరాబాదులో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. భారీ తారాగణంతో రూపొందుతోన్న ఈ సినిమాపై అటు అభిమానుల
నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రస్తుతం ఎన్టీఆర్ బయోపిక్‌లో నటిస్తున్నారు. జాగర్లమూడి క్రిష్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం హైదరాబాదులో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. భారీ తారాగణంతో రూపొందుతోన్న ఈ సినిమాపై అటు అభిమానుల్లోను, ఇటు ఇండస్ట్రీలోను భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను జనవరి 9న రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇదిలావుంటే... బాలయ్య గురించి ఓ న్యూస్ బయటకు వచ్చింది. అది ఏంటంటే... బాలయ్య ఓ యువ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని. ఇంతకీ ఆ యువ దర్శకుడు ఎవరంటే.. పటాస్, సుప్రీమ్, రాజా ది గ్రేట్ చిత్రాలతో హ్యాట్రిక్ సాధించిన అనిల్ రావిపూడి. ప్రస్తుతం అనిల్ రావిపూడి వెంకటేష్, వరుణ్ తేజ్‌లతో ఎఫ్ 2 అనే సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా కూడా సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. ఈ సినిమా తర్వాత బాలయ్య సినిమా స్టార్ట్ చేస్తాడని టాక్ వినిపిస్తోంది. ఇదే కనుక నిజమైతే బాలయ్యను ఈ యంగ్ డైరెక్టర్ ఎలా చూపిస్తాడో..?