Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్షణికావేశంలో ఆత్మహత్యాయత్నం.. అబ్బాయి మృతి.. అమ్మాయి..?

క్షణికావేశం కొంపముంచింది.. అవును.. క్షణికావేశంలో ఇద్దరూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వాళ్లిద్దరూ మైనర్లు. తమ మధ్య ఏర్పడిన ఆకర్షణను ప్రేమగా భావించారు. అయితే ఇంతలో ఏమైందో ఏమోకానీ ఆత్మహత్యాయత్నానికి ప

Webdunia
సోమవారం, 24 సెప్టెంబరు 2018 (12:19 IST)
క్షణికావేశం కొంపముంచింది.. అవును.. క్షణికావేశంలో ఇద్దరూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వాళ్లిద్దరూ మైనర్లు. తమ మధ్య ఏర్పడిన ఆకర్షణను ప్రేమగా భావించారు. అయితే ఇంతలో ఏమైందో ఏమోకానీ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో అబ్బాయి మరణించాడు. అమ్మాయి మృత్యువుతో పోరాడుతోంది.
 
ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బాపూజీ నగర్‌లో నివాసం ఉండే పదో తరగతి చదువుతున్న బాలికకు, కేటీపీఎస్ కాలనీలో డిప్లొమా చదువుతున్న పోశం మణికంఠతో పరిచయం ఏర్పడింది. వీరిద్దరూ ప్రేమలో వున్నారు. ఇంతలో ఏం జరిగిందో ఏమో కానీ ఆదివారం సాయంత్రం, నిర్మాణంలో ఉన్న ఓ భవంతిపైకి ఎక్కిన వీరు, పైనుంచి కిందకు దూకారు.
 
అదే సమయంలో అటుగా వెళుతున్న స్థానికులు, 108కు సమాచారం ఇవ్వగా, వారిని ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలోనే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిన మణికంఠ మృతి చెందాడు. బాలిక కాళ్లు, చేతులు విరిగి, ముఖానికి తీవ్ర గాయాలైన స్థితిలో ఉండగా, మెరుగైన చికిత్స కోసం ఖమ్మం తరలించారు. 
 
ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా వుందని.. మృత్యువుతో ఆమె పోరాడుతుందని వైద్యులు చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ashwin Babu: వచ్చిన వాడు గౌతమ్ గా అశ్విన్ బాబు రన్నింగ్ లుక్

మయసభ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను : సాయి దుర్గ తేజ్

వెంకన్న స్వామి ఆశీస్సులు, ప్రేక్షకుల ప్రేమ వల్లే ఈ విజయం : విజయ్ దేవరకొండ

నారా రోహిత్, శ్రీ దేవి విజయ్ కుమార్ చిత్రం సుందరకాండ నుంచి ప్లీజ్ మేమ్ సాంగ్

హనీ మూన్ ఇన్ షిల్లాంగ్ వెండితెరపై రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు విద్యార్ధులు

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

తర్వాతి కథనం
Show comments