Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంతర్జాతీయ తీవ్రవాదిలా బాబు మనస్తత్వం: మంత్రి పేర్నినాని

Webdunia
సోమవారం, 6 ఏప్రియల్ 2020 (17:59 IST)
చంద్రబాబుకు మానవత్వం లేదని, మానవీయ కోణం అసలే లేదని, బాబు మనస్తత్వం అంతర్జాతీయ తీవ్రవాదిలా ఉందని రాష్ర్ట రవాణా,సమాచార పౌరసంబంధాల శాఖమంత్రి పేర్ని నాని మండిపడ్డారు.

సోమవారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. "కరోనా నియంత్రణలోను, కట్టడికి ప్రభుత్వం అన్ని విధాలుగా అప్రమత్తంగా ఉంది. ప్రభుత్వ సూచనలను ప్రజలందరూ పాటిస్తున్నారు. ప్రజలు,ఉద్యోగులు, ముఖ్యమంత్రి వైయస్ జగన్ కృషి వల్ల మిగిలిన రాష్ర్టాలతో పోలిస్తే కరోనా కట్టడిలో ఆంధ్రప్రదేశ్ ముందుంది. లాక్ డౌన్ చేస్తూ కేంద్రం చెప్పిన నిర్ణయాలకంటే ముందే ఏపి రాష్ర్టం అంతా కూడా లాక్ డౌన్ చేయాలని నిర్ణయించింది.

ఈరోజు బాధ్యతగా వ్యవహరించాల్సిన చంద్రబాబు బాధ్యత మరిచి కష్టసమయంలో కూడా తన నీచ బుధ్దిని చూపించుకుంటున్నారు. రాష్ర్టంలోని పసిపిల్లల దగ్గర్నుంచి ముదుసలి వరకు చిరుద్యోగి నుంచి రాష్ర్ట సిఎం వరకు బాధ్యతాయుతంగా పగలు రాత్రి తేడాలేకుండా దేశసరిహద్దులలో ఉద్యోగం చేసే సైనికులతో సమానంగా కరోనాను అరికట్టేందుకు యుధ్దం చేస్తున్నారు.
 
ఇలాంటి క్లిష్టసమయంలో విమర్శలు చేయడం చంద్రబాబుకు కరెక్టెనా? రాష్ర్టం ఎలా ఉన్నా ఆరోపణలే చంద్రబాబుకు ముఖ్యం. ఇలాంటి తప్పుడు మాటలు బాబుకు అలవాటే. పక్కరాష్ర్టంలో బతుకుతూ చంద్రబాబు దిగజారి ప్రవర్తిస్తున్నారు.
 
వ్యాధి వ్యాప్తి చెందకుండా చేతులు కడు్క్కోండి. శుభ్రత పాటించండి అనే మంచి విషయాలు చెబుతున్నట్లు నటిస్తూ ప్రభుత్వంపై నిందాపనిందలు వేస్తున్నారు. కేంద్రం ఇచ్చిన డబ్బులు ఇస్తున్నారని మాట్లాడుతున్నారు. ఈ రాష్ర్టంలో కాకుండా పెళ్లాం, పిల్లలతో పరాయి రాష్ర్టంలో బతుకుతున్నావు. ఆనందమయ జీవితం గడుపుతున్నావు.

గతంలోనే డిక్లేర్ చేశారు. నరేంద్రమోదికి భార్యాపిల్లలు లేరు, నాకున్నారు నాకు పదవిపోయినా మనవడితో ఆడుకుంటానని చెప్పావు. ఆడుకో...ఎవరూ వద్దనరు. కాని అక్కడ కూర్చుని కూడా నీ నక్కజిత్తుల తెలివితేటలు చూపిస్తున్నావు. ఇలాంటి నేతనా మేం ముఖ్యమంత్రిగా భరించిందనేబాధ. లాక్ డౌన్ ప్రకటించి ఆరునుంచి పదిగంటల వరకు స్వీయనియంత్రణ.

నిత్యావసర సరుకులకు మాత్రమే వెసులుబాటు కల్పించి,వ్యాధిని నియంత్రిస్తూ అనుమానితులందర్ని కూడా క్వారంటైన్లకు తరలిస్తూ నిర్ణయం తీసుకున్నాం. రాష్ర్ట వ్యాప్తంగా 20 వేల క్వారంటైన్ బెడ్లు ఏర్పాటుచేశాం. అంటే ప్రతి నియోజకవర్గానికి  కనీసం 100 బెడ్లతో క్వారంటైన్ భవనాలుగా ఏర్పాటుచేశాం. అంత అప్రమత్తంగా పనిచేస్తున్నాం. విదేశాలనుంచి వచ్చిన వ్యక్తులను ట్రేస్ చేస్తూ కేంద్రం మనకు ఇచ్చిన లెక్కకంటే కూడా ఎక్కువగా మనం ట్రేస్ చేశాం.
 
వాలంటీర్ల ద్వారా ఇళ్లు జల్లెడ పట్టి 28 వేల మంది విదేశాలనుంచి వచ్చారని లెక్కతేల్చుకుని వారిని ఆరోగ్యపరిస్దితిని ట్రాక్ చేస్తూ క్వారంటైన్ చేస్తూ కరోనా లక్షణాలు ఉంటే కోవిడ్ ఆస్పత్రులకు తరలిస్తున్నాం, చికిత్స అందిస్తున్నాం. ఈరోజు చంద్రబాబు గంటా నలభై నిముషాల సేపు ప్రసంగించారు. ఆయన బాధ ఏంటో, అక్కసేంటో తెలియడం లేదు. అంతర్జాతీయ తీవ్రవాదులకు చంద్రబాబుకు  తేడా కనిపించడం లేదు.
 
చంద్రబాబు మనస్తత్త్వం చూస్తే అంతర్జాతీయ తీవ్రవాదిలా ఉన్నారు. వారికి కూడా మానవత్వం ఉండదు. తీవ్రవాదులు కూడా వేరే దేశంలో ఉంటూ ఇక్కడ బాంబులు పెడుతూ,రకరకాల వైరస్ లు పంపుతుంటారు. నాశనం కోరుకుంటారు. ప్రతి చావులో కూడా లాభం వెదుక్కుంటారు. ఈ చావుకు మేమే కారణం అని డిక్లేర్ చేస్తుంటారు. హైద్రాబాద్ లో కోట బంగ్లాలో ఉంటున్నారు. దుర్మార్గమైన ప్రేలాపనలు, తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు.

వ్యాధి బాగా ప్రబలిపోయింది అని చంద్రబాబు అంటున్నారు. కప్పెట్టి ఏం చేస్తారు? దాచి ఏం చేస్తారు? గుట్టుగా ఉంచి ఏం చేయగలుగుతారు? ఎక్కడ ఏ ఊర్లో ప్రబలింది? ఇక్కడ ప్రజలు అమాయకులనా? సరే, ఉంటే నీ మనుషులకు నీ కార్యకర్తలకు,నేతలకు సోకి ఉండాలి కదా.

మీరు చెప్పేంత స్దితిలో ఏపి ఉండి, వైయస్ జగన్ మోహన్ రెడ్డి మొత్తం అంతా దాచి ప్రపంచానికి తెలియకుండా వందలకొద్ది సంఖ్యలో మృతి చెంది,వేలు ,లక్షల కొద్ది వ్యక్తులు కరోనా లక్షణాలు ఉన్నా సరే మేం ఎవరికి చెప్పడం లేదని మీరు ప్రచారం చేస్తున్నారు కదా. మీ మాజి ఎంఎల్ఏలకు కిందిస్దాయి నేతలకు ఎవరికి సోకిందో చెప్పండి. ఎవరికైనా సోకితే చికిత్స చేయిస్తాం.
 
లెక్కకు మిక్కిలిగా ఉన్నారని అంటున్నారు కదా! దుర్మార్గమైన ఆలోచనలు మానుకుంటే మంచిది. కరోనా వ్యాధి పేరుతో ముఖ్యమంత్రి చెప్పిన ప్రతి మాటను పోలీసు వ్యవస్ద అంతా కంటిపై నిద్ర లేకుండా 24 గంటలు రోడ్లపై ఉద్యోగాలు చేస్తున్నారు. పాజిటివ్ కేసులు వచ్చినచోట్ల కూడా(రెడ్ జోన్లు) వైద్యులు, వైద్యసిబ్బంది, పారిశుధ్యకార్మికులు, రెవిన్యూ, ఏఎన్ఎంలు, ఆశావర్కర్లు ,వాలంటీర్లు వీరంతా చిరుద్యోగులు ప్రాణాలకు తెగించి సేవలందిస్తున్నారు.

మున్సిపాల్టిలలో శానిటరీ ఇన్ స్పెక్టర్లు, సూపర్ వైజర్లు అంతా పారిశుధ్యపనిలో వారుంటున్నారు. మిలటరీలో దేశాన్ని కాపాడటానికి ఏ విధంగా సైనికులు పోరాడుతున్నారో అదే విధంగా వారందరూ సేవలందిస్తున్నారు. విలేకరులను చూసైనా చంద్రబాబు సిగ్గుతెచ్చుకోవాలి.

ఆర్దిక బాధలు దిగమింగి ప్రజలను అప్రమత్తం చేయడంలో, ప్రభుత్వసూచనలు ప్రజలకు చేరవేయడంలో ప్రజలను మేలుకొల్పుతూ వ్యాధిని అరికట్టడంలో విలేకరులు సేవలందిస్తున్నారు వారి ఉద్యోగం అది కాదు. మీడియా వారు సామాజిక బాధ్యతగా పనిచేస్తున్నారు.అయినా చంద్రబాబు కుసంస్కారంతో ప్రవర్తిస్తున్నారు.
 
ఇంతమంది పనిచేస్తుంటే ఇంకా వ్యాధి ప్రబలుతుందని చంద్రబాబు చెబుతున్నారు. అంటే మీరు ఎవర్ని దెబ్బతీయదలుచుకున్నారు. ఎవరి ఆత్మస్దైర్యం దెబ్బతీస్తున్నారు.ప్రాణాలకు తెగించి సేవలందిస్తున్నవారిని వారి ఆత్మస్ధైర్యాన్నిప్రెస్ మీట్లు పెట్టి  దెబ్బతీస్తున్నారా. కరోనా వ్యాధి వస్తుందనే ముందువరకు కూడా చాలా డిపార్ట్ మెంట్లను గురించి తిట్టుకునే పరిస్దితి నుంచి ఈరోజు ఆయా డిపార్ట్ మెంట్లను,ఉద్యోగులను ప్రజలు నేడు వారి సేవలు చూసి వేనోళ్ల కొనియాడుతున్నారు.పరీక్షలు జరగడంలేదంటారు.
 
దొంగలెక్కలు రాయడం చంద్రబాబుకే అలవాటు.దుర్మార్గమైన ఆలోచనలు చంద్రబాబు మానుకోవాలి. రికార్డుల కోసం దొంగలెక్కలు రాసేవారు.ప్రతిది నెంబర్ వన్ మన రాష్ర్టం అని చెప్పేవారు.వ్యాధి లక్షణాలు ఉంటే వారికి టెస్ట్ లు చేస్తారు. కరోనా లెక్కలు దాచామని చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారు.చంద్రబాబు లెక్కలు చెబితే వారికి పరీక్షలు చేయిస్తాం.ఢిల్లీనుంచి వచ్చినవారికి టెస్ట్ లు రాస్తారు.అది కూడా ఎక్కువ కేసులు నమోదు అవుతున్నాయి కాబట్టి వారికి చేస్తారు. విదేశాలనుంచి వచ్చిన వారికి చేస్తారు.
 
ఆంధ్రరాష్ర్టంలో ఐదుకోట్ల మంది ఉంటే ఐదుకోట్ల మందికి పరీక్షలు చేస్తారా? ఎక్కడైతే వ్యాధిప్రబలుతుంటే అక్కడ పరీక్షలు చేస్తారు. 40 ఏళ్ల అనుభవం,14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన తనకు ఇవి తెలియవా?  ప్రతి పౌరుడు కరోనా పై యుద్దం చేస్తుంటే చంద్రబాబు ఆరోపణలు చాలా బాధాకరం. మానవత్వం లేదు.మానవీయకోణం అసలేకనిపించడం లేదు.నరేంద్రమోది డబ్బులు ఇస్తున్నారు జగన్ ఇవ్వడం లేదంటారు. ఇంగితజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు.

రాష్ర్టంలో కేంద్రం ద్వారా జన్ ధన్ ఎకౌంట్లలో 500 చొప్పున వేస్తున్నారు.జగన్ గారు వాలంటీర్ల ద్వారా వేయి రూపాయలు లబ్దిదారులకు అందించారు. ఈ విదంగా మన రాష్ర్టంలో తప్ప ఇతర రాష్ర్టాలలో ఎక్కడా కూడా ఇవ్వలేదు. ఏపిలో మాత్రమే కోటి 35 లక్షల కుటుంబాలకు అందించారు.బుధవారం సాయంత్రానికి కోటి 47 లక్షల కుటుంబాలకు అందిస్తారు.ఈయనే కాదు బిజేపినేతలు కూడా దిగజారి మాట్లాడుతున్నారు.
 
పాత కమ్యూనిస్టు పార్టీలు కూడా దిగజారి రాజకీయ అవసరాలకంటే కూడా సామాజిక, ఆర్దికఅవసరాల కోసం ఎర్రజెండాలు  పనిచేయడం బాధాకరం.ఉఛ్చం, నీఛం లేకుండా దిగజారి ప్రవర్తిస్తున్నారు. వైయస్ జగన్ కమ్యూనిస్టు భావ జాలాన్ని అమలు చేస్తున్నారు.శభాష్ అనాల్సిన కమ్యూనిస్టులు పచ్చచొక్కాలు కోసం దిగజారి ప్రవర్తిస్తున్నారు.
 
ఎవరో ఉత్తరాలు రాస్తే సంతకం పెట్టి, వేలిముద్రలు వేయడం చేస్తున్నారు.పదవులు కోసం కాక జనం కోసం బతికిన కమ్యూనిస్టులను చూశాం. కాని ఈరోజు వేరే అవసరాల కోసం పనిచేస్తున్నారు. ప్రత్యేకించి ఓ పార్టీ ...రామకృష్ణది ఏముంది పాపం? నారాయణ చేతిలో రిమోట్ ఉంటుంది. రామకృష్ణ నడుస్తుంటారు, మాట్లాడుతుంటారు ఏం చేస్తాం? వారి పరిస్దితి అలా అయిపోయింది. టాకింగ్ డాల్ పరిస్దితి.

ఇచ్చే వేయిరూపాయలు చాలదు.ఇంకా ఇవ్వాలని అంటున్నారు.ఇప్పటికే ఉచితంగా బియ్యం, కందిపప్పు ఇచ్చాం.మరోసారి బియ్యం, శనగపప్పు ఇవ్వబోతున్నారు.మూడోసారి కూడా పంపిిణి చేస్తాం.కష్టకాలంలో ఇప్పుడు ఇచ్చే సహాయం వారి జీవితాలను ఉధ్దరిస్తాయని కాదు.చంద్రుడుకి నూలుపోగులా మీకు అండగా వైయస్ జగన్ ఉన్నారు, ఈ ప్రభుత్వం ఉంది అనేందుకు అవి ఇవ్వడం జరిగింది.

రెడ్ జోన్లను ప్రకటించిన చోట్ల ప్రభుత్వమే కూరగాయలు, సరుకులు, మందులు ఇంటిముందుకే ఇచ్చేలా సేవలందిస్తున్న ప్రభుత్వాన్ని భుజం తట్టాల్సిందిపోయి.ఉద్యోగుల మనోస్దైర్యాన్ని దెబ్బతీస్తున్నారు. మాకు అయ్యో పాపం అనేదేమంటే మీ ఇంగ్లీషు మీ మనవడికి నేర్పద్దు.అతనిని చెడగొట్టద్దు.
 
చంద్రబాబుకు ప్రభుత్వ ఉద్యోగులంటే విపరీతమైన అక్కసు,విలేకరులు అన్నా కూడా వ్యతిరేకం. వారు సైనికుల్లా పనిచేస్తుంటే వారిని ఇబ్బంది పెట్టేవిధంగా మాట్లాడుతున్నారు. ఆయన పాలనా కాలంలో మీకు అదిస్తాం, ఇదిస్తాం అని తిప్పుకున్నారు.వారిని చులకన భావంతో చూసిన పరిస్దితి.
 
కరోనా కేసుల విషయంలో జనహితం కోసం పనిచేస్తున్న విలేకరులు రాంగ్ రిపోర్ట్ చేస్తున్నట్లుగా చంద్రబాబు మాట్లాడుతున్నారు. వేల సంఖ్యలో మరణాలు ఉన్నాయి కాని ప్రభుత్వం దాస్తుందనే విధంగా చంద్రబాబు మాట్లాడుతున్నారంటే విలేకరులు వాస్తవాలు దాస్తున్నట్లుగా మాట్లాడుతున్నట్లేకదా.

అవాస్తవాలు రాస్తున్నారనేకదా. రాష్ర్టానికి కరోనా సోకిందనే బాధ కంటే ఇలాంటి దిక్కుమాలిన వ్యక్తి మమ్మల్ని ఇన్నాళ్లు పాలించారా అని ప్రజలు బాధపడుతున్నారు.మీరు జూమ్ యాప్ ద్వారా నీ అక్కసును, నీ విషాన్ని చిమ్ముతున్నారు. ఆ జూమ్ యాప్ ను మూసేస్త్తే మంచిది. రైతు బజార్లను వికేంద్రీకరించి సామాజిక దూరం పాటిస్తూ,రోగులకు సేవలందిస్తూ ఉద్యోగులకు రక్షణాత్మకమైన ఎక్విప్ మెంట్ ఇస్తున్నాం.

మెడ్ టెక్ అంటున్నారు.అదేదో ఆయన కనిపెట్టినట్లు మాట్లాడుతున్నారు.రాష్ర్టం ముందుచూపుతో వ్యవహరిస్తున్నా కూడా తానేదో సలహా ఇస్తున్నట్లు ఫోజులు కొడుతున్నారు. రాష్ర్టంలో చాలా సంస్ధలు శానిటైజర్స్ తయారుచేస్తున్నాయి. గ్లౌజులు,మాస్క్ లు తయరవుతున్నాయి.చాలా వాటిని కన్వర్ట్ చేసి ఉత్పత్తులు చేస్తున్నాయి.
 
రైతులకు కష్టకాలం అని చంద్రబాబు చెబుతున్నారు.ఈ యుధ్ద వాతావరణంలోనే కాదు చంద్రబాబు పాలనలో రైతులకు ఇవ్వాల్సిన సబ్సిడీలు ఇవ్వకుండా, ధాన్యం కొని వారికి డబ్బులు చెల్లించకుండా విత్తనాలు అందించకుండా అన్ని విధాలా బాధపెట్టారు.ఈరోజు రైతుల గురించి మొసలి కన్నీరు కారుస్తున్నారు.
 
నిత్యం రైతుల గురించి ఆలోచిస్తూ పంటలకు గిట్టుబాటుధరల విషయంలో కూడా వారికి ఎటువంటి ఇబ్బంది రాకుండా జగన్ నిర్ణయాలు తీసుకుంటున్నారు.నిరంతరం ఆయా శాఖల మంత్రులతో సమీక్షలు చేస్తూ చర్యలు తీసుకుంటున్నారు. ఉద్యోగులూ మీరెవ్వరూ కూడా  నక్కజిత్తులమారి ఏడుపు గొట్టు మనిషి పరాయి రాష్ర్టంలో ఉంటూ ఇక్కడ విద్వేషాన్ని సృష్టించాలనే ప్రయత్నాలు చేస్తున్న చంద్రబాబు మాటలు పట్టించుకోవద్దు.

జగన్ పిలుపుమేరకు హోంగార్డునుంచి ఎస్పీ వరకు వైద్యులు నర్సులు,పారిశుధ్యకార్మికులు,మున్సిపల్ ఉద్యోగులు,రెవిన్యూ ఉద్యోగులు  విఆర్ ఏలనుంచి జిల్లా కలెక్ట్రర్లు, కరోనా వ్యాప్తిని ఆరికట్టడంలో సేవలందిస్తున్న వారందరికి ఆర్టిసి,ఎక్సైజ్ , రవాణా ఉద్యోగులకు, కుటుంబాలను పట్టించుకోకుండా ప్రజలను అప్రమత్తం చేయడంలో సైనికుల్లా పనిచేస్తున్న విలేకరులందరికి మేం, మా ప్రభుత్వం పాదాభివందనం చేస్తూ శాల్యూట్ చేస్తున్నాం" అని పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏడాది క్రితం ట్వీట్స్ పెడితే ఇప్పుడు మనోభావాలు దెబ్బతినడం ఏంటి: వర్మ లాజిక్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అఖిల్ అక్కినేని, జైనాబ్ రావ్‌జీల నిశ్చితార్థం చేశామన్న నాగార్జున

రోటి కపడా రొమాన్స్‌ బాగా లేదంటే సినిమాలకు రిటైర్‌మెంట్‌ : దర్శకుడు విక్రమ్‌ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments