అయేషా మీరా మృతదేహానికి మళ్లీ శవపరీక్ష - సీబీఐ నిర్ణయం

Webdunia
శుక్రవారం, 13 డిశెంబరు 2019 (10:39 IST)
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఆయేషా మీరా హత్య కేసు విచారణ మళ్లీ పునఃప్రారంభంకానుంది. ఈ హత్య కేసు రీ విచారణలో భాగంగా, 12 యేళ్ల క్రితం పాతిపెట్టిన అయేషా మీరా మృతదేహాన్ని వెలికి తీసి మళ్లీ రీపోస్టుమార్టం చేయాలని సీబీఐ భావిస్తోంది. ఈ మేరకు ఉన్నతాధికారులు స్థానిక అధికారులను సంప్రదించారు. 
 
2007లో డిసెంబర్ 27న విజయవాడ శివారు ప్రాంతాల్లో తెనాలికి చెందిన విద్యార్థిని ఆయేషా మీరా దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ కేసులో కొందరు ప్రముఖ రాజకీయ నాయకుల పుత్రులు ఉన్నట్టు ఆరోపణలు వచ్చినా, అవి నిరూపితం కాలేదు. కేసుకు సంబంధం లేని సత్యంబాబు అనే యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. 
 
ఈ కేసు విచారణ కూడా సుధీర్ఘకాలం పాటు సాగింది. తొమ్మిదేళ్ల జైలు జీవితం అనంతరం సత్యం బాబు నిర్దోషిగా బయటకు వచ్చాడు. ఆపై కేసులో అసలు నిందితులు ఎవరో తేల్చేందుకు సీబీఐ రంగంలోకి దిగింది. కొన్ని నెలల క్రితమే మృతదేహం అవశేషాలను బయటకు తీయాలని భావించినా, కొన్ని కారణాలతో అది సాధ్యపడలేదు. ఈ నెల 30లోగా రీ పోస్ట్ మార్టమ్ పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నట్టు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓ.. చెలియా లోని నాకోసం ఆ వెన్నెల.. బాణీ ఎంతో హాయిగా ఉంది : జేడీ చక్రవర్తి

Ram: ఆంధ్ర కింగ్ తాలూకా... చిన్ని గుండెలో సాంగ్ తొో రామ్ పోతినేని

Bigg Boss Telugu 9: శ్రీజ దమ్ము రీ ఎంట్రీ.. దివ్వెల మాధురిపై ఎదురు దాడి.. వాయిస్‌పై ట్రోలింగ్స్

Suryakantham: ఒకరి బాధను సంతోషంగా తీసుకోలేనని తెగేసి చెప్పిన సూర్యకాంతం

Ravi Teja: రవితేజ, శ్రీలీల ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ, యాక్షన్ తో విడుదలైన మాస్ జతర ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments