Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్‌లో ఉచిత ఆరోగ్య శిబిరాలను నిర్వహించనున్న యాక్సిస్‌ బ్యాంక్‌

Webdunia
బుధవారం, 26 ఏప్రియల్ 2023 (23:22 IST)
అంతర్జాతీయ ఆరోగ్య దినోత్సవం పురస్కరించుకుని, భారతదేశంలో మూడవ అతిపెద్ద ప్రైవేట్‌ రంగ బ్యాంక్‌లలో ఒకటైన యాక్సిస్‌ బ్యాంక్‌, ఆంధ్రప్రదేశ్‌లో ఉచిత ఆరోగ్య శిబిరాలను నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఈ ఆరోగ్య శిబిరాలను విజయవాడ, రాజమండ్రి, కాకినాడ, విశాఖపట్నంలలో ఎంపిక చేసిన యాక్సిస్‌బ్యాంక్‌ కేంద్రాల వద్ద నిర్వహించనున్నారు.
 
ఈ బ్యాంక్‌ దీని కోసం సుప్రసిద్ధ డయాగ్నోస్టిక్‌ కేంద్రాలు, హాస్పిటల్స్‌ అయిన అపోలో హాస్పిటల్స్‌, కేర్‌ హాస్పిటల్స్‌, మ్యాక్సివిజన్‌ హాస్పిటల్స్‌, శంకర్‌ నేత్రాలయ వంటి వాటితో భాగస్వామ్యం చేసుకుంది. తద్వారా బ్యాంకు ఖాతాదారులు అత్యుత్తమ వైద్య మార్గనిర్ధేశకత్వంను నిపుణులైన డాక్టర్ల నుంచి పొందగలరు. ఈ ఆరోగ్య శిబిరాలలో ఉచితంగా వైద్య పరీక్షలు చేయడంతో పాటుగా డాక్టర్ల కన్సల్టేషన్‌ కూడా ఉచితంగా అందిస్తారు. ఈ పరీక్షలలో కంటి పరీక్షలు, రక్తపోటు(బీపీ), ర్యాండమ్‌ బ్లడ్‌ షుగర్‌ (ఆర్‌బీఎస్‌), ఈసీజీ వంటివి ఉంటాయి.
 
ఈ ఆరోగ్య శిబిరాలను ఈ దిగువ శాఖలలో నిర్వహించనున్నారు. అవి ....
26 ఏప్రిల్‌- కాకినాడ డివిజన్‌లో తాడేపల్లి గూడెం శాఖ, మరియు రాజమండ్రి డివిజన్‌లో ఏలూరు
మే 03- రాజమండ్రి డివిజన్‌లో ఏలూరు ఒన్‌ మరియు విజయవాడ డివిజన్‌లో చిల్లకల్లు
మే 04- విజయవాడ డివిజన్‌లో తెనాలి శాఖ
మే 05- విజయవాడ డివిజన్‌లో మచిలీపట్నం మరియు విజయవాడ వ్యూహాత్మక శాఖలు
మే 06- విజయవాడ డివిజన్‌లో గుణదల, నూజివీడు మరియు విశాఖపట్నంలో డాబా గార్డెన్స్‌ శాఖలు
 
ఆరోగ్యం పట్ల అవగాహన మెరుగుపరచడంతోపాటుగా సమాజానికి వైద్యఆరోగ్య మౌలిక సదుపాయాలు మెరుగుపరచాలనే యాక్సిస్‌ బ్యాంక్‌ లక్ష్యంలో ఈ కార్యక్రమం ఓ భాగం. ఈ ఆరోగ్య శిబిరాలలో రోజుకు 200 మందికి పైగా ఖాతాదారులు ఈ సేవలను వినియోగించుకుంటారని అంచనా.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రంగస్థలం.. గేమ్ ఛేంజర్.. సైకిల్ తొక్కుతున్న చెర్రీ.. టీడీపీ క్యాడర్ హ్యాపీ?

డాకు మహారాజ్ యాభై రోజుల్లో మీముందుకు రాబోతుంది

పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు డేట్ ఫిక్స్ చేశారు

గగన మార్గన్‌ లో ప్రతినాయకుడిగా విజయ్ ఆంటోని మేనల్లుడు అజయ్ ధిషన్‌

ఆయన వల్లే బాలక్రిష్ణ సినిమాలో శ్రద్దా శ్రీనాథ్ కు ఛాన్స్ వచ్చిందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

క్యాబేజీతో బిర్యానీ.. పెరుగు పచ్చడితో టేస్ట్ చేస్తే.. అదిరిపోతుంది...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

తర్వాతి కథనం
Show comments