నా స్నేహితుడితో పడుకో... నాకు తాగడానికి డబ్బులు కావాలి... ఆమె ఏం చేసింది?

Webdunia
బుధవారం, 10 ఏప్రియల్ 2019 (18:26 IST)
అతనో ఆటో డ్రైవర్.. ఏడుగురిని పెళ్లి చేసుకున్నాడు..భర్త పెట్టే వేధింపులు భరించలేక నలుగురు భార్యలు వదిలిపెట్టి వెళ్లిపోగా మరో ఇద్దరు మృతి చెందారు.. ఏడో భార్యను కూడా నిత్యం మద్యం తాగి వేధిస్తుండగా, అతని బాధలు భరించలేక ఆమె కొట్టి చంపింది. 
 
వివరాల్లోకి వెళితే, మెదక్ జిల్లా పాపన్నపేటకు చెందిన 42 ఏళ్ల షేక్ షాబుద్దీన్ దుండిగల్‌కు చెందిన ఖైరున్నీసా బేగంను 2011లో వివాహం చేసుకుని. గాజులరామారం డివిజన్ రావినారాయణరెడ్డి నగర్‌లో కాపురం చేస్తున్నాడు. షాబుద్దీన్ ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్న షాబుద్దీన్‌కి  అప్పటికే ఆరుగురితో వివాహం జరిగింది. వారిలో నలుగురు భార్యలు వదిలి వెళ్లిపోయారు. 
 
మరో ఇద్దరు మృతిచెందినట్లు సమాచారం. దీంతో ఖైరున్నీసాను ఏడో భార్యగా చేసుకున్నాడు. ఖైరున్నీసాకు అప్పటికే విహహం కాగా మొదటి భర్తకు కలిగిన సంతానం దుండిగల్‌లోని తల్లి వద్ద ఉంటున్నారు.
 
షాబుద్దీన్ నిత్యం మద్యం సేవించి భార్యను వేధిస్తున్నాడు. రోజు రోజుకు అతని వేధింపులు ఎక్కువయ్యాయి. మద్యం తాగేందుకు డబ్బులు లేకపోవడంతో ఆమెను వ్యభిచారం చేయాలని ఒత్తిడి చేస్తున్నాడు. ఈ వేధింపులు భరించలేక ఖైరున్నీసా మంగళవారం తెల్లవారు జామున ఇనుపరాడ్డుతో భర్త మెడపై కొట్టడంతో కింద పడ్డాడు. చున్నీతో గొంతుకు బిగించి హత్య చేసింది. 
 
వెంటనే ఖైరున్నీసా నేరుగా జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Boman Irani: రాజా సాబ్ నుంచి బొమన్ ఇరానీ బర్త్ డే పోస్టర్

బాలకృష్ణ 'అఖండ-2'కు టిక్కెట్ ధరలు పెంపు

రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్ జంటగా అనుమాన పక్షి

వార్నింగ్ ఇచ్చే G.O.A.T సినిమా తీసుకున్నా : మొగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి

Samyukta: ప్రాక్టీస్ తర్వాత మోకాలు నొప్పి తో ఫిజియోథెరపీ తీసుకున్నా : సంయుక్త

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

తర్వాతి కథనం
Show comments