ఆ కామాంధుడిని ప్రతిఘటించలేక మిన్నకుండిపోయా...

సాయం చేస్తానని చెప్పి హోటల్ వెనుక వైపునకు తీసుకెళ్లి అత్యాచారం చేశాడనీ, ఆ సమయంలో ఆ కామాంధుడిని ప్రతిఘటించలేక మిన్నకుండిపోయానని ఓ అత్యాచార బాధితురాలు బోరున విలపిస్తూ చెప్పుకొచ్చింది.

Webdunia
మంగళవారం, 29 మే 2018 (13:29 IST)
సాయం చేస్తానని చెప్పి హోటల్ వెనుక వైపునకు తీసుకెళ్లి అత్యాచారం చేశాడనీ, ఆ సమయంలో ఆ కామాంధుడిని ప్రతిఘటించలేక మిన్నకుండిపోయానని ఓ అత్యాచార బాధితురాలు బోరున విలపిస్తూ చెప్పుకొచ్చింది. ఈ అత్యాచారం హైదరాబాద్, బాచుపల్లి పోలీస్ స్టేషన్‌ పరిధిలో జరిగింది. ఈ అత్యాచార ఘటన వివరాలను పరిశీలిస్తే..
 
బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రగతినగర్‌కు చెందిన ఓ యువతి (20), తన తల్లికి కావాల్సిన మందుల కోసం సోమవారం రాత్రి మెడికల్ షాపుకు వెళ్లేందుకు ఇంటికి సమీపంలో ఉన్న రోడ్డుపైకి వచ్చి నిలబడింది. 
 
ఆ సమయంలో ఇందిరమ్మ కాలనీకి చెందిన ఆటో డ్రైవర్ ఎస్.పరశురామ్ అటుగా వెళుతూ, ఆ యువతి వద్ద ఆటోను ఆపి.. ఎక్కడికి వెళ్లాలి అని అడిగాడు. దానికి మెడికల్ షాపుకు వెళ్లాలని ఆమె చెప్పింది. సరే.. మెడికల్ షాపు వద్ద దించుతానని ఆటో డ్రైవర్ ఆ యువతిని నమ్మించాడు. దీంతో ఆమె ఆటో ఎక్కింది. వెంటనే ఆటో డ్రైవర్ నిర్మానుష్యంగా ఉండే ఓ హోటల్ వెనుక ప్రదేశానికి తీసుకెళ్లి ఆటోలోనే అత్యారానికి పాల్పడ్డాడు. 
 
దాహంతో మంచినీళ్ల కోసం ప్రాధేయపడటంతో, అదే ఆటోలో ఓ టీ స్టాల్ వద్దకు తీసుకువచ్చాడు. ఆ సమయంలో అటుగా వెళుతున్న పెట్రోలింగ్ వ్యాన్‌ను చూసి యువతి కేకలు వేయడంతో ఆమెను వదిలి ఆటోలో పారిపోయాడు. ఏదో జరిగిందని తెలుసుకున్న పోలీసులు, తమ వాహనంలో ఆటోను ఛేజ్ చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. 
 
జరిగిన ఘటనపై బాధితురాలు స్పందిస్తూ, అనారోగ్యంతో ఉన్న తన తల్లికి అవసరమైన అత్యవసర మందుల కోసం అర్ధరాత్రి రోడ్డుపైకి వచ్చి నిలపడగా, అటుగా వచ్చిన పరశురామ్ తనను నమ్మించి మోసం చేశాడనీ వాపోయింది. పైగా, అత్యాచారం చేసే సమయంలో ఆ కామాంధుడిని ప్రతిఘటించలేక మిన్నకుండిపోయినట్టు తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్- రజనీ సినిమా నుంచి సుందర్ సి అవుట్.. కాలుజారిన రజనీ.. అదే కారణమా?

బైకర్ నుంచి శర్వా, మాళవిక నాయర్.. ప్రెట్టీ బేబీ సాంగ్ రిలీజ్

Love OTP Review: ట్రెండ్ కు తగ్గ ప్రేమ కథాంశంగా లవ్‌ ఓటిపి.. రివ్యూ

Tandavam song: ఓం నమహ్ శివాయ.. అఖండ తాండవం సాంగ్ రిలీజ్

సత్య, రితేష్ రానా.. జెట్లీ హ్యూమరస్ టైటిల్ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments