Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయవాడలో దారుణం : బాలికపై ఆటో డ్రైవర్ లైంగికదాడి

Webdunia
సోమవారం, 2 మే 2022 (13:39 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆడబిడ్డలకు ఏమాత్రం రక్షణ లేకుండాపోయింది. గత వారం రోజుల వ్యవధిలో వరుస అత్యాచార ఘటనలు జరుగుతున్నాయి. గుంటూరు జిల్లా రేపెల్లె రైల్వే స్టేషనులో గర్భవతి అయిన వలస మహిళ కూలీపై ముగ్గురు కామాంధులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణం మరిచిపోకముందే విజయవాడలో ఓ ఆటో డ్రైవర్ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ ఘటన కృష్ణా జిల్లా నూజివీడులో జరిగింది. 
 
ఈ కేసుకు సంబంధించి కృష్ణలంక పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు నూజివీడు మండలానికి చెందిన ఇంటర్ చదువుతున్న బాలికక బెంగుళూరుకు చెందిన ఆంజనేయులు అనే వ్యక్తి ఫేస్‌బుక్‌లో పరిచయమయ్యాడు. 
 
తాను శనివారం విజయవాడకు వస్తున్నట్టు బాలికకు సమాచారం ఇచ్చాడు. దీంతో ఆ బాలిక తన స్నేహితులతో కలిసి విజయవాడకు వచ్చింది. వారంతా కలిసి దుర్గ గుడికి వెళ్లి అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. ఆ తర్వాత ఆ యువతి పాటు ఆమె స్నేహితులంతా ఎవరి ఇళ్లకు వారు వెళ్లిపోయారు. ఆంజనేయులు మాత్రం ఒక లాడ్జీలో ఉన్నట్టు బాలికకు చెప్పాడు. 
 
దీంతో ఆ బాలిక అతన్ని చూసేందుకు మళ్లీ వచ్చింది. ఒంటరిగా రావడాన్ని విజయవాడ సింగ్‌నగర్‌కు చెందిన ఆటో డ్రైవర్ గుర్తించాడు. తాను లాడ్జి వద్ద దింపుతానని ఆ యువతిని నమ్మించాడు. అతని మాటలు నమ్మి ఆటో ఎక్కిన ఆ బాలికను ఆటో డ్రైవర్ నేరుగా పొలాల్లోకి తీసుకెళ్లి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. 
 
అయితే, ఆ బాలిక పెద్దగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు గమనించి కృష్ణలంక పోలీసులకు సమాచారం అందించారు. వారు హుటాహుటిన అక్కడకు చేరుకుని బాలికను రక్షించాడు. అయితే, ఆటో డ్రైవర్ అప్పటికే అక్కడ నుంచి పారిపోయాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి పరారీలో ఉన్న ఆటో డ్రైవర్ కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్య 2, ఆదిత్య 369 సినిమాలకు అంతక్రేజ్ దక్కలేదా?

సీతారాములు, రావణుడు అనే కాన్సెప్ట్‌తో కౌసల్య తనయ రాఘవ సిద్ధం

మరో వ్యక్తితో శృంగారం కోసం భర్తను మర్డర్ చేసే రోజులొచ్చాయి, నీనా గుప్తాకి రివర్స్ కామెంట్స్

Charmi: విజయ్ సేతుపతి, పూరి జగన్నాధ్ చిత్రం టాకీ పార్ట్ సిద్ధం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న అరి’సినిమా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం