ఆటో డ్రైవర్‌గా చంద్రబాబు... మున్ముందు ఎలక్ట్రిక్ వాహనాలే...

Webdunia
శనివారం, 2 ఫిబ్రవరి 2019 (14:02 IST)
టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆటో డ్రైవర్‌గా మారిపోయారు. ఖాకీ చొక్కా వేసుకుని ఇద్దరు మహిళలను కూర్చోబెట్టుకుని ఆటో నడిపారు. అలా ఆటో డ్రైవర్ పాత్రలో శనివారం కనిపించారు. సీఎం చంద్రబాబును అనేక మంది ఆటోలు డ్రైవర్లు కలిశారు. ఈ సందర్భంగా రోడ్ ట్యాక్స్ రద్దు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. 
 
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, రోడ్డు పన్ను రద్దు కేవలం ఆరంభం మాత్రమేనని ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం ఇంకా ఎన్నో చేస్తానని హామీ ఇచ్చారు. రూ.140 కోట్ల నష్టం వస్తుందని చెప్పినా... ఆటో డ్రైవర్లకు భారం ఉండకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఆర్థిక కష్టాలు ఉన్నా ఏపీ అభివృద్ధికి కృషి చేస్తున్నానన్నారు. రాబోయే రోజుల్లో అన్నీ ఎలక్ట్రికల్ వాహనాలే ఉంటాయన్నారు. 

ఆటో ఎక్కే ప్రయాణికులను ఏ విధంగా అయితే గమ్యస్థానానికి చేర్చాలని ఓ ఆటో డ్రైవర్‌గా మీరు ఎలా భావిస్తారో.. ఒక రాష్ట్రాన్ని నడిపించే డ్రైవర్‌గా ప్రజలకు మంచి చేయాలని తాను భావిస్తున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో 3.75 లక్షల మంది ఆటో డ్రైవర్లకు భవిష్యత్‌లో బీమా సదుపాయం కల్పిస్తామన్నారు. ఇందుకోసం ఆటో డ్రైవర్లు అంతా కలిసి ఒక యూనియన్‌గా ఏర్పడాలని ఆయన సూచన చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా ఇంటి బంగారం కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌: ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో సమంత

పెద్ది రామ్‌చరణ్ బాడీగార్డుకి రోజుకి రూ. 2 లక్షల జీతం, అదిరిపోతున్న టాలీవుడ్

Trisha: ఇప్పట్లో ఎన్నికల్లో పోటీ చేయకూడదనుకుంటున్న త్రిష? ఎందుకో తెలుసా?

అనన్య పాండేకు ఆన్‌లైన్ ట్రోలింగ్.. అది భరత నాట్యమేనా? (video)

Ananth Sriramఫ మా తల్లిదండ్రులను కాపాడండి: అనంత్ శ్రీరామ్

తర్వాతి కథనం
Show comments