ఆగస్టు 7న ఆసెట్‌ పరీక్ష

Webdunia
బుధవారం, 17 జూన్ 2020 (09:11 IST)
ఆంధ్ర యూనివర్సిటీలో 2020-21 విద్యా సంవత్సరానికి ఎంఎ, ఎంకాం, ఎమ్మెస్సీలో ప్రవేశాలకు నిర్వహించే ఆసెట్‌-2020 పరీక్షలకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు చేసుకోవడానికి అవకాశం కల్పించారు.  జులై 5వ తేదీ తుది గడువని ఎయు ప్రవేశాల సంచాలకులు ఆచార్య డిఎ.నాయుడు తెలిపారు.

ఒసి అభ్యర్థులు రూ.600, ఎస్సీ, ఎస్టీ, పిహెచ్‌సి అభ్యర్ధులు రూ.500 రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించాలని తెలిపారు. జులై 10వ తేదీ లోపు వెయ్యి రూపాయలు అపరాధ రుసుముతో ఆన్‌లైన్‌ దరఖాస్తులు చేసుకోవచ్చని పేర్కొన్నారు.

జులై 25 నుంచి వెబ్‌సైట్‌ ద్వారా హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని తెలిపారు. ఎయు ఇంజినీరింగ్‌ కళాశాలలో అర్హులైన అభ్యర్థులు ఆరేళ్ళ ఇంజినీరింగ్‌ డ్యూయల్‌ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి ఆన్‌లైన్‌ ద్వారా జులై 5వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.

జులై 10వ తేదీ లోపు రూ.1500 అపరాధ రుసుముతో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశముందని తెలిపారు. దరఖాస్తు, ప్రోసెసింగ్‌ రుసుము రూ.1200, ఎస్సీ, ఎస్టీ, పిహెచ్‌సి అభ్యర్థులైతే రూ.1000 రుసుము చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

జులై 25వ తేదీ నుంచి వెబ్‌సైట్‌ ద్వారా హాల్‌టికెట్లు పొందవచ్చని తెలిపారు. ఆగస్టు 7న ఎంట్రన్స్‌ పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దేశీ ప్రిన్సెస్‌'లా మెరిసిపోతున్న జాన్వీ కపూర్

Nani: 150 మిలియన్+ వ్యూస్ తో నాని ది ప్యారడైజ్ ఆయా షేర్ సాంగ్

Devi Sri Prasad: ఎల్లమ్మ చేయడానికి స్ఫూర్తిని ఇచ్చిన గ్రామం వెదురుపాక: దేవిశ్రీ ప్రసాద్

Karthi: ఈ ఏడాది చిత్రాల సందడితో 49వ పుట్టినరోజు జరుపుకుంటున్న కార్తి

కెమెరాతో కథ చెప్పాలి, రీ-రికార్డింగ్‌కి కూడా కథలో స్పేస్ ఉండాలి : కెమెరామెన్ రత్నవేలు

తర్వాతి కథనం
Show comments