Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుచ్చకాయల వ్యాపారిపై దాడి: వీఆర్‌లోకి పోలీసులు

Webdunia
శనివారం, 8 మే 2021 (11:28 IST)
గుంటూరు జిల్లా నరసరావుపేట పట్టణం, ఒకటో పట్టణ పోలీసు స్టేషన్‌లో పనిచేస్తున్న ఎస్సైతో పాటు మరో ఇద్దరు కానిస్టేబుళ్లను వీఆర్‌లోకి పంపుతూ పోలీసు శాఖ ఉన్నతాధికారులు శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. లాక్‌డౌన్‌ అమల్లో భాగంగా ఒకటో పట్టణ ఎస్సై వెంకటేశ్వర రావు, సిబ్బంది గురువారం రాత్రి గస్తీ తిరుగుతుండగా పల్నాడు రోడ్డులో నరసయ్య అనే పుచ్చకాయల వ్యాపారి దుకాణం తీసి ఉండటాన్ని గుర్తించారు.

కర్ఫ్యూ అమల్లో ఉండగా రాత్రి సమయంలో దుకాణం ఎందుకు తీశావని పోలీసులు ప్రశ్నించగా వ్యాపారి వారితో దురుసుగా వ్యవహరించాడు. దీంతో విధుల్లో ఉన్న కానిస్టేబుళ్లు వ్యాపారిని స్టేషన్‌కు రమ్మని చెప్పగా అందుకు నిరాకరించాడు. దీంతో ఆగ్రహించిన కానిస్టేబుళ్లు సదరు వ్యక్తిపై చేయిచేసుకున్నారు. అనంతరం పోలీసులు బలవంతంగా స్టేషన్‌కు తరలించారు.

దుకాణం వద్ద జరిగిన గొడవ అంతా సీసీ కెమెరాలో నమోదైంది. శుక్రవారం ఉదయం దుకాణం వద్దకు వచ్చిన వ్యాపారి సీసీ కెమెరాలో నిక్షిప్తమైన వీడియోను పోలీసు ఉన్నతాధికారులకు పంపాడు. స్పందించిన ఉన్నతాధికారులు ఎస్సై మరో ఇద్దరు కానిస్టేబుళ్లపై వేటు వేశారు. ముగ్గురిని వీఆర్‌లోకి పంపూతూ ఎస్పీ కార్యాలయం నుంచి ఉత్తర్వులొచ్చాయని డీఎస్పీ విజయ భాస్కరరావు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాబిన్‌హుడ్ తో ఈ క్రిస్మస్ మాదే : హీరో నితిన్

శ్రీ గాంధారిగా భయపెట్టించేందుకు వస్తున్న హన్సిక

ముఫాసా: ది లయన్ కింగ్ నుంచి ముఫాసా ప్రయాణంతో షారుఖ్ ఖాన్

వెంకటేష్, ఐశ్వర్య రాజేష్ లపై వెన్నెల రాత్రి నేపథ్యంలో సాంగ్ చిత్రీకరణ

వెన్నెల కిషోర్, మోనికా చౌహాన్, కమల్ కామరాజు ల‌ ఒసేయ్ అరుంధతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments