Webdunia - Bharat's app for daily news and videos

Install App

మిస్టర్ బ్రహ్మనాయుడు... ఏమిటీ కండకావరం?: అచ్చెన్నాయుడు ఆగ్రహం

Webdunia
మంగళవారం, 25 మే 2021 (19:37 IST)
వినుకొండ ప్రభుత్వాసుపత్రిల్లో శివశక్తి ఫౌండేషన్ గత వారంరోజులుగా ఆకలితో అలమటిస్తున్న పేదలకు భోజనం పెడుతుంటే ఎమ్మెల్లే బొల్లా బ్రహ్మనాయుడు పోలీసులతో అడ్డుకోవడం దుర్మార్గం అంటూ అచ్చెన్నాయుడు మండిపడ్డారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ... 23సంవత్సరాలుగా శివశక్తి ఫౌండేషన్ రాజకీయాలకు అతీతంగా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోంది.  పేదల నోటికాడ కూడు తీయడానికి మీకు మనసెలా ఒప్పింది? మిస్టర్ బ్రహ్మనాయుడు వాట్ ఈజ్ దిస్... ఏమిటీ కండకావరం... పోగాలం దాపురించినవారే ఇటువంటి అరాచక చర్యలకు పాల్పడతారు.

మీ అరాచకం, అహంభావానికి ఈ చర్య నిదర్శనం కాదా? ఒక ప్రజాప్రతినిధిగా పేదలకు పట్టెడన్నం పెట్టేవారిని వీలైతే ప్రోత్సహించాలి, లేదంటే నోరుమూసుకొని కూర్చోవాలి తప్ప ఈవిధంగా చేయమేమిటి? ఇళ్లస్థలాలపేరుతో కోట్లు కొల్లగొట్టడం తప్ప సేవచేయడం తెలియని మీరు చేసేవారికి అడ్డు చెప్పడమేమిటి? కేవలం రాజకీయ దురుద్దేశంతో మీరు ఆడుతున్న వికృత క్రీడను రాష్ట్రప్రజలంతా అసహ్యించుకుంటున్నారు.

ఆసుపత్రిలో రోగులకు కనీస సౌకర్యాలు లేకపోతే పట్టించుకున్న పాపాన పోని ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు ఒక స్వచ్చంద సంస్థ పేదల ఆకలి తీర్చుతుంటే ఓర్వలేకపోవడం విచారకరం. మీరు, మీ ప్రభుత్వం అంతా సక్రమంగా చేస్తే పేదలకు ఈ కష్టాలు ఎందుకు? రాజకీయాలకు అతీతంగా శివశక్తి ఫౌండేషన్ వినుకొండలో తమ సేవలను అందిస్తోంది. దాతలు చేసే సాయాన్ని అడ్డుకోవడం ఏమిటి? రాష్ట్రంలో ఆక్సిజన్ సరిపడనంత లేకపోతే దాతలే కదా ప్రస్తుతం ఆదుకుంటున్నది.

మీ ముఖ్యమంత్రి ఈరోజు పత్రికాముఖంగా వారికి కృతజ్జతలు కూడా తెలిపారు. శివశక్తి ఫౌండేషన్ అధినేత మీ రాజకీయ ప్రత్యర్థి అయినంత మాత్రాన పేదలకు ఆకలితీర్చడానికి అందించే భోజనాన్ని అడ్డుకుని వాహనాలను పోలీస్ స్టేషన్ కు తరలిస్తారా?  ఇప్పటికైనా కళ్లు తెరచి మానవత్వంతో వ్యవహరించండి, విజ్జతతో ప్రవర్తించండి. ఈ చర్యను తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments