Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుజరాత్‌లో చిక్కుకుపోయిన ఏపీ మత్స్యకారులకు సాయం: జగన్‌

Webdunia
బుధవారం, 8 ఏప్రియల్ 2020 (10:25 IST)
లాక్‌డౌన్‌ వల్ల గుజరాత్‌లో చిక్కుకుపోయిన ఏపీ మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలు తన దృష్టికి రావడంతో వెంటనే స్పందించిన సీఎం జగన్‌.. వారికి అన్ని రకాలుగా సాయం అందించాలని అధికారులను ఆదేశించారు.

వివరాల్లోకి వెళితే.. కరోనా కట్టడిలో భాగంగా దేశవ్యాప్తంగా 21 రోజుల లాక్‌డౌన్‌ విధించడంతో ఏపీకి చెందిన 5 వేల మంది మత్స్యకారులు గుజరాత్‌లోని వెరావల్‌లో చిక్కుకుపోయారు. అయితే అక్కడ వారు పడుతున్న ఇబ్బందులను ఏపీ ప్రభుత్వానికి విన్నవించారు.
 
దీనిపై తక్షణమే స్పందించిన సీఎం వైఎస్‌ జగన్‌.. వారికి సాయం అందిచాల్సిందిగా ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి సతీష్‌ చంద్రకు ఆదేశాలు జారీచేశారు. దీంతో అధికారులు శ్రీకాకుళం నుంచి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి గుజరాత్‌కు పంపించారు.

ఆ బృందం జాలర్లకు వసతి, ఆహారంతోపాటు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసింది. జాలర్ల యోగ క్షేమాలు ముఖ్యమని ప్రభుత్వం తెలిపింది. వారు రాష్ట్రానికి తిరిగి వచ్చేంతవరకు వారి బాగోగులు చూసుకుంటామని స్పష్టం చేసింది.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments