Webdunia - Bharat's app for daily news and videos

Install App

లోటుపాట్లు లేకుండా భక్తులకు ఏర్పాటు: వెలంపల్లి శ్రీనివాస్

Webdunia
బుధవారం, 6 అక్టోబరు 2021 (20:16 IST)
భక్తులకు ఎటువంటి లోటుపాట్లు లేకుండా అన్ని ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ మాత్యులు వెలంపల్లి శ్రీనివాస్ అన్నారు. రేపటి నుండి అనగా గురువారం నుండి 15వ తేదీ వరకు నిర్వహించే శరన్నవరాత్రి  ఉత్సవాలకు భక్తులకు చేసిన ఏర్పాట్లను రాష్ట్ర దేవాదాయ శాఖ మాత్యులు వెలంపల్లి శ్రీనివాస్ స్థానిక శాసనసభ్యులు మల్లాది విష్ణు వర్ధన్ తో కలిసి పరిశీలించారు.

అనంతరం మీడియా ప్రతినిధులతో మంత్రి మాట్లాడుతూ అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆయన అన్నారు. వినాయక టెంపుల్ నుండి అమ్మవారి దర్శనం వరకు చేసిన క్యూలైన్లను పరిశీలించడం జరిగిందని ఆయన అన్నారు.క్యూలైన్లలో భక్తులను చేసిన ఏర్పాట్లను పరిశీలించి మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు అధికారులకు పలు సూచనలు చేయడం జరిగిందన్నారు.

కోవిడ్ నిబంధనలు పాటిస్తూ త్వరితగతిన భక్తులకు అమ్మవారి దర్శనం జరిగేలా ఏర్పాటు చేసినట్లు మంత్రి అన్నారు. భక్తులకు అవసరమైన అన్ని మౌలిక వసతులు ముఖ్యంగా త్రాగునీరు, వైద్య శిబిరాలు ఏర్పాటు చేశామన్నారు. కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా లోటుపాట్లను సరిదిద్దేందుకు  పర్యవేక్షించడం జరుగుతుందని మంత్రి అన్నారు. ఈ పర్యటనలో మంత్రితో పాటు స్థానిక శాసనసభ్యులు మల్లాది విష్ణు వర్ధన్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

మూడు డిఫరెంట్ వేరియేషన్స్ తో అజిత్ కుమార్ ద్విభాషా చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ

ఎన్టీఆర్ ‘దేవర’ నుంచి అనిరుద్ సారథ్యంలో ఫియర్ సాంగ్’ న్యూ లుక్ విడుదల

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments