Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్నేహితులతో పందెంకాసి కాల్వలో దూకిన ఆర్మీ జవాన్ గల్లంతు

ఠాగూర్
ఆదివారం, 15 సెప్టెంబరు 2024 (15:44 IST)
స్నేహితులతో పందెంకాసి కేసీ కెనాల్‌ కాలువలో దూకిన ఆర్మీ జవాను ఒకరు గల్లంతయ్యారు. అతడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ విషాదకర ఘటన కర్నూలు జిల్లాలో జరిగింది. 24 యేళ్ల పవన్ అనే ఆర్మీ జవాను స్నేహితులతో పందెం కాసి కేసీ కాల్వలో ఈతకు దిగాడు. అయితే, వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో నీటి ప్రవాహంలో కొట్టుకునిపోయాడు. 
 
దీంతో కంగారుపడిన స్నేహితులు వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడకు చేరుకుని గాలింపు చర్యలు చేపట్టినా జవాను ఆచూకీ లభ్యం కాలేదు. కాగా, పవన్ ప్రస్తుతం జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో విధులు నిర్వహిస్తున్నారు. 
 
రెండు రోజుల్లో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తా : కేజ్రీవాల్ 
 
తాను మరో రెండు రోజుల్లో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. ఆయన ఆదివారం తొలిసారి పార్టీ కొత్త ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు, నాయకులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఆ తర్వాత ఆయన కీలక ప్రసంగం చేశారు. మరో రెండు రోజుల్లో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. "నేను ప్రజల్లోకి వెళ్లి ఓటు వేయమని అడుగుతాను. నేను నిజాయితీపరుడిని అనుకుంటే ప్రజలు నాకు ఓటు వేస్తారు. అపుడు నేను మళ్లీ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొంటా. లేదంటే లేదు" అని ప్రకటించారు. మరో రెండు రోజుల్లో సీఎం పదవికి రాజీనామా చేస్తానని, ఆ తర్వాత పార్టీ ఉన్నత స్థాయి సమావేశం జరుగుతుందని, ఆ తర్వాత సీఎం పేరును వెల్లడిస్తామని తెలిపారు. 
 
అయితే, అరవింద్ కేజ్రీవాల్ చేసిన ఈ వ్యాఖ్యల పట్ల పార్టీలో అంతర్గతంగా చర్చ మొదలైంది. దీంతో ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ వివరణ ఇచ్చారు. ముఖ్యమంత్రిగా కేజ్రీవాలే ఉండాలని పార్టీలో ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారని స్పష్టం చేశారు. అయితే, కేజ్రీవాల్ వ్యాఖ్యల వెనుక ఉద్దేశం ఏమిటంటే... నవంబరులో ఎన్నికలకు వెళ్లి సత్తా నిరూపించుకోవాలని ఆయన భావిస్తున్నారని భరద్వాజ్ వివరించారు. ప్రజలు కేజ్రీవాల్ నిజాయతీపరుడు అని గుర్తిస్తే ఆప్ ఎన్నికల్లో గెలుస్తుందని, కేజ్రీవాల్ మరోసారి సీఎం అవుతారని స్పష్టం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

UK-chiru: నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది’ - యునైటెడ్ కింగ్‌డమ్‌లో మెగాస్టార్ చిరంజీవి

Nani: హిట్ : ది థర్డ్ కేస్ నుంచి నాని, శ్రీనిధి శెట్టి పై ఫస్ట్ సింగిల్ షూట్

Varma: ఏపీలో శారీ సినిమాకు థియేటర్స్ దొరకవు అనుకోవడం లేదు - రామ్ గోపాల్ వర్మ

జాక్ - కొంచెం క్రాక్ గా వుంటాడు, నవ్విస్తాడు : సిద్ధు జొన్నలగడ్డ

లైసెన్స్ ఉన్న బెట్టింగ్ యాప్‌‍లకే విజయ్ దేవరకొండ ప్రచారం చేశారట...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments