Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిరుద్యోగులకు గుడ్ న్యూస్-ఏపీఎస్ఎస్‌డీసీ నుంచి జాబ్ మేళా

Webdunia
శుక్రవారం, 25 మార్చి 2022 (10:41 IST)
నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్‌డీసీ) నుంచి  జాబ్ మేళాకు రంగం సిద్ధం చేసింది. ఈ నెల 26 నిర్వహించనున్న ఈ జాబ్ మేళా ద్వారా ప్రముఖ కియా మోటార్స్, Bharat Fih, TATA PLAYతో పాటు మరో రెండు సంస్థల్లో 400 ఖాళీలను భర్తీ చేయనున్నారు. 
 
అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా రిజిస్టర్ చేసుకోవాలని ప్రకటనలో పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు ఈ నెల 26న ఉదయం 10 గంటలకు మంగళకర డిగ్రీ కాలేజ్, గోరంట్ల రోడ్డు, పుట్టపర్తి, అనంతపూర్ అనే చిరునామాలో నిర్వహించే ఇంటర్వ్యూలలో హాజరు కావాల్సి వుంటుంది. 
 
ఇకపోతే.. ఈ జాబ్ మేళా ద్వారా నిరుద్యోగులు సులభంగా ఉద్యోగాలు కొట్టేయవచ్చు. కియా మోటర్స్.. నీమ్ ట్రైనీ విభాగంలో 100 ఖాళీలు ఉన్నాయి. డిప్లొమా/బీటెక్ చేసిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు.  అభ్యర్థుల వయస్సు 18-25 ఏళ్లు ఉండాలి. కేవలం పురుషులు మాత్రమే ఈ ఖాళీలకు అప్లై చేసుకోవాలి.
 
Bharath FIH Limitedలో అసెంబ్లింగ్ మొబైల్ ఫోన్స్  విభాగంలో 100 ఖాళీలు ఉన్నాయి. టెన్త్/ఇంటర్/బీఈ/బీటెక్ చేసిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. 
 
Tata Play: ప్రమోటర్స్ విభాగంలో 50 ఖాళీలు ఉన్నాయి. టెన్త్, ఆపై విద్యార్హత కలిగిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవాలని ప్రకటనలో స్పష్టం చేశారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments