Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో ప్రారంభమైన ఆర్టీసీ బస్సు సేవలు...

Webdunia
గురువారం, 21 మే 2020 (10:31 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్టీసీ సేవలు గురువారం ఉదయం నుంచి ప్రారంభమయ్యాయి. లాక్డౌన్ కారణంగా గత 60 రోజులుగా డిపోలకే పరిమితమైన ఈ బస్సులు... లాక్డౌన్ సడలింపుల కారణంగా రోడ్డెక్కాయి. మొత్తం 436 మార్గాల్లో 1,683 బస్సులు అంటే 17 శాతం బస్సులు ప్రయాణికులకు సేవలు అందించనున్నాయి. 
 
ఈ బస్సుల్లో కేవలం 50 శాతం సీటింగ్ కెపాసిటీతో నడుపనున్నారు. అయితే, ప్రయాణికులు బస్సెక్కాలంటే మాత్రం కొన్ని నిబంధనలను ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. అందులో మొదటిది ఆరోగ్యసేతు యాప్. ప్రతీ ప్రయాణికుడి వద్ద కోవిడ్-19 ట్రాకింగ్ యాప్ ఉంటేనే బస్సులోకి అనుమతిస్తారు.
 
ఇక, ఈ బస్సులు ప్రస్తుతానికి ఓ బస్టాండు నుంచి మరో బస్టాండుకు మాత్రమే నడుస్తాయి. ఈ బస్సుల్లో ఎటువంటి రాయితీలు వర్తించవు. అవసరం అనుకుంటే ఏసీ బస్సులను నడుపుతామని, 26 డిగ్రీల ఉష్ణోగ్రత మాత్రమే అందులో ఉంచుతామని అధికారులు తెలిపారు. అటెండర్లు ఉండరని, దుప్పట్లు ప్రయాణికులే తెచ్చుకోవాల్సి ఉంటుందని అన్నారు.
 
ఇక 65 ఏళ్లు పైబడిన వృద్ధులు, పదేళ్లలోపు చిన్నారులు అత్యవసరం అయితే తప్ప ప్రయాణాలు చేయవద్దని కోరారు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ బస్సుల్లో కండక్టర్లు ఉండరు. అన్ని బస్సులకు ఆన్‌లైన్‌లోనే టికెట్లు కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది. కౌంటర్‌లో టికెట్ బుక్ చేసుకున్న వారు తమ పేరు, ఫోన్ నంబరు ఇవ్వడం తప్పనిసరి చేసింది. 
 
అయితే, 50 శాతం ప్రయాణికులతో ఈ బస్సులను నడుపనున్న దృష్ట్యా ప్రయాణ ఛార్జీలు పెంచుతారనే ప్రచారం సాగుతోంది. దీనిపై రాష్టర రవాణా శాఖా మంత్రి పేర్ని నాని స్పందించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్టీసీ నష్టం వాటిల్లినా ప్రయాణికులపై మాత్రం భారం మోపబోమని, సాధారణ బస్సు చార్జీలతో 50 శాతం ప్రయాణికులతోనే బస్సులను తిప్పుతామని తెలిపారు. కాగా, తెలంగాణలో ఇప్పటికే ఆర్టీసీ బస్సు సేవలు ప్రారంభమైన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

గోల్డ్ స్మగ్లింగ్ కేసు : కన్నడ నటి రన్యారావుకు జైలు

NATSలో శంబాల టీజర్ కు స్పందన, చివరి దశలో పోస్ట్-ప్రొడక్షన్ పనులు

వినూత్నమైన కాన్సెప్ట్ తో బకాసుర రెస్టారెంట్‌ : దర్శకుడు ఎస్‌జే శివ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

తర్వాతి కథనం
Show comments