కరోనా వైరస్ నిరోధానికి దేశ వ్యాప్తంగా లాక్డౌన్ అమలవుతోంది. మార్చి 25వ తేదీన ప్రారంభమైన ఈ లాక్డౌన్ ఇప్పటికి మూడు దశలు పూర్తి చేసుకోగా, ప్రస్తుతం నాలుగో దశ లాక్డౌన్ కొనసాగుతోంది. ఇది ఈ నెల 31వ తేదీ అర్థరాత్రి కొనసాగుతుంది. అయితే, వచ్చే నెల ఒకటో తేదీ నుంచి దేశ వ్యాప్తంగా 200 రైళ్లను నడిపేందుకు కేంద్ర రైల్వేశాఖ చర్యలు చేపట్టింది. దీనికి కారణం.. లాక్డౌన్ ఆంక్షలను కేంద్ర ప్రభుత్వం సడలించడమే. ఫలితంగా ప్రస్తుతం నడుస్తున్న శ్రామిక్ రైళ్ళతో సంబంధం లేకుండా కొత్తగా మరో 200 రైళ్లను నడుపనున్నారు.
అయితే, తెలుగు రాష్ట్రాల మీదుగా నడిచే రైళ్ళు ఏవి.? ఏయే రూట్లలో నడుస్తాయి? ప్రయాణ వేళలు ఏమిటి? తదితర వివరాలను బుధవారం రాత్రి రైల్వే బోర్డు ఖరారు చేసి విడుదల చేసింది. ఈ వివరాలను అన్ని జోన్ల జీఎంలకు పంపింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని రూట్లను ఎంపిక చేశారు.
ఈ రైళ్లలో ప్రయాణం చేయదలసిన వారు గురువారం నుంచి అంటే మే 21వ తేదీ నుంచి రిజర్వేషన్ చేసుకోవచ్చు. స్లీపర్ బోగీల్లో రిజర్వేషన్లు పూర్తయిన తర్వాత 200 టికెట్లను వెయిటింగ్ లిస్టులో జారీ చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇప్పటివరకు నడిపిన ప్రత్యేక రైళ్లలో జనరల్ బోగీలు లేకపోగా, జూన్ 1 నుంచి నడపనున్న రైళ్లు సాధారణ రైళ్లలాగా, ఏసీ, స్లీపర్, జనరల్ బోగీలు ఉంటాయని అధికారులు తెలిపారు. అలాగే, స్టాపులు కూడా గతంలో మాదిరిగానే ఉంటాయి.
ఇక, అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఈ రైళ్లలో సాధారణ బోగీలు ఉన్నప్పటికీ వాటికీ రిజర్వేషన్ ఉంటుంది. అంటే రైలులోని అన్ని బోగీలు రిజర్వేషనే అన్నమాట. జనరల్ కోచ్‌లో ప్రయాణించే వారి నుంచి ద్వితీయ శ్రేణి సీటింగ్ రుసుమును వసూలు చేస్తారు. టికెట్లు అన్నింటినీ ఆన్‌లైన్‌లోనే తీసుకోవాలి. రైల్వే స్టేషన్‌లో టికెట్లు విక్రయించరు. నెల రోజుల ముందుగా కూడా టికెట్లను రిజర్వు చేసుకునే వీలుంది.
తెలుగు రాష్ట్రాల మీదుగా ప్రయాణించనున్న రైళ్ళ వివరాలు...
* ముంబై - హైదరాబాద్ హుస్సేన్ సాగర్ ఎక్స్‌ప్రెస్ (02701/02)