Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్ఐ పరీక్ష తుది ఫలితాలు రిలీజ్

Webdunia
గురువారం, 7 డిశెంబరు 2023 (11:26 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్ఐ పరీక్ష తుది ఫలితాలను విడుదల చేశారు. ఈ ఫలితాలను పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు తమ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ప్రధాన పరీక్ష తుది ఆన్సర్ కీని కూడా బోర్డు విడుదల చేసింది. అభ్యర్థులు తమ రోల్ నంబర్, రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టినతేదీ వివరాల ద్వారా ఈ ఫలితాలను తెలుసుకోవచ్చని తెలిపింది. 
 
ఏపీ వ్యాప్తంగా మొత్తం 411 ఎస్ఐ పోస్టుల భర్తీ కోసం గత యేడాది నవంబరు నెలలో నోటిఫికేషన్ విడుదల చేయగా, ఈ పరీక్షకు మొత్తం 173047 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. గత ఫిబ్రవరి 19వ తేదీన ప్రాథమిక పరీక్ష నిర్వహించగా, ఈ పరీక్షకు 151288 మంది హాజరయ్యారు. వీరిలో 57923 మంది అభ్యర్థులు మెయిన్ పరీక్షకు అర్హత సాధించారు. ఆ తర్వాత జరిగిన దేహదారుఢ్య పరీక్షల్లో అర్హత సాధించిన 31193 మంది అభ్యర్థులకు తుది రాత పరీక్ష నిర్వహించి తాజాగా ఫలితాలను విడుదల చేశారు. 
 
ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి చేసే తొలి సంతకం ఎక్కడంటే... 
 
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గురువారం మధ్యాహ్నం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నాంపల్లికి చెందిన రజని అనే వికలాంగ యువతికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చే ఫైలుపై సంతకం చేస్తారు. ఈ మేరకు ఆమెకు ఆహ్వానం కూడా అధికారులు పంపించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తొలి ఉద్యోగం నీకే ఇస్తామంటూ గత అక్టోబరు నెలలో రజనికి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. తాను పూజీ పూర్తి చేసినప్పటికీ ప్రైవేటు లేదా ప్రభుత్వం ఉద్యోగం రాలేదని రేవంత్ రెడ్డి వద్ద ఆమె తన ఆవేదనను వెలిబుచ్చారు. 
 
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే రోజున సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఖర్గే వస్తారని, వారి సమక్షంలోనే ఉద్యోగం ఇస్తామని ఆమెకు రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ మేరకు ఆమెకు రేవంత్ రెడ్డి గ్యారెంటీ కార్డును రాసి ఇచ్చారు. సో... గురువారం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం తర్వాత ఆయన రజనీకి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చే ఫైలుపై తొలి సంతకం చేస్తారు. ఇందులోభాగంగా, రజనీకి రేవంత్ రెడ్డి ప్రమాణా స్వీకారోత్సవ ఆహ్వానం కూడా అధికారులు పంపించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Aravind: తెలంగాణ ప్రభుత్వం అనుమతితో శ్రీతేజ్‌ను పరామర్శించిన అల్లు అరవింద్‌

"కల్కి 2898 AD": ప్రభాస్ జపాన్ స్కిల్స్ అదుర్స్.. వీడియో వైరల్

prasad behera arrest, నటి బ్యాక్ టచ్ చేస్తూ లైంగిక వేధింపులు

కాలికి గాయంతో జపాన్ పర్యటన రద్దు చేసుకున్న ప్రభాస్

యదార్థ సంఘటనలతో నేటివిటి కథ విడుదల-2 : చింతపల్లి రామారావు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పీచు పదార్థం ఎందుకు తినాలి?

లాస్ ఏంజిల్స్‌లో ఘనంగా నాట్స్ బాలల సంబరాలు

కరక్కాయ దేనికి ఉపయోగిస్తారు, ప్రయోజనాలు ఏమిటి?

స్త్రీలకు ఎడమ వైపు పొత్తికడుపు నొప్పి, తగ్గేందుకు ఇంటి చిట్కాలు

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

తర్వాతి కథనం
Show comments