బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీకి భారీ వర్ష సూచన

ఠాగూర్
శుక్రవారం, 8 ఆగస్టు 2025 (19:33 IST)
ఈ నెల 13వ తేదీన అంటే వచ్చే బుధవారం నాటికి వాయువ్య, దానిని అనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ), విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీ ఎస్డీఎంఏ) స్పష్టంచేశాయి. దీని ప్రభావంతో ఏపీలో విస్తారంగా పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించాయి. 
 
మరోవైపు, ద్రోణి ప్రభావంతో రానున్న 24 గంటల్లో రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ముఖ్యంగా, శనివారం ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడతాయని హెచ్చరించారు. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు నమోదవుతాయని పేర్కొన్నారు. 

నిండు ప్రాణం తీసిన స్కూటర్ పార్కింగ్ గొడవ - మృతుడు హీరోయిన్ కజిన్ 
 
ఢిల్లీలో అత్యంత దారుణమైన ఘటన చోటు చేసుకుంది. బాలీవుడ్ నటి హుమా ఖురేషీ దగ్గరి బంధువు, సోదరుడైన అసిఫ్ ఖురేషీ (42) దారుణ హత్యకు గురయ్యాడు. కేవలం స్కూటర్ పార్కింగ్ విషయంలో చెలరేగిన చిన్న గొడవ ప్రాణం తీయడం స్థానికంగా కలకలం రేపింది. ఈ కేసుకు సంబంధించి ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేసి, హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు.
 
పోలీసుల కథనం మేరకు.. గురువారం రాత్రి 11 గంటల సమయంలో నిజాముద్దీన్ ప్రాంతంలో జరిగింది. ఆసిఫ్ ఖురేషీ ఇంటి ముందు ఇద్దరు వ్యక్తులు తమ స్కూటర్‌ను అడ్డంగా పార్క్ చేశారు. ఇంటికి దారి లేకుండా ఉండటంతో స్కూటర్‌ను పక్కకు జరపమని ఆసిఫ్ వారిని కోరారు. 
 
ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య మాటామాటా పెరిగి వాగ్వాదం మొదలైంది. అది కాస్తా తీవ్ర ఘర్షణకు దారితీయడంతో, ఆగ్రహంతో ఊగిపోయిన ఆ ఇద్దరు వ్యక్తులు ఆసిఫ్‌పై దాడి చేసి దారుణంగా హత్య చేశారు.
 
ఈ ఘటనపై హుమా ఖురేషీ తండ్రి, ఆసిఫ్ మేనమామ అయిన సలీమ్ ఖురేషీ మాట్లాడుతూ, "ఇంటి ముందు ఇద్దరు వ్యక్తులు స్కూటర్ పెట్టారు. దారికి అడ్డంగా ఉందని పక్కకు తీయమని నా మేనల్లుడు అడిగాడు. దానికే పెద్ద గొడవ చేసి, ఇద్దరూ కలిసి వాడిని చంపేశారు" అని ఆవేదన వ్యక్తం చేశారు.
 
మృతుడు ఆసిఫ్ ఖురేషీ స్థానికంగా చికెన్ వ్యాపారం నిర్వహిస్తున్నారని, ఆయనకు ఇద్దరు భార్యలు ఉన్నారని తెలిసింది. చిన్న కారణానికి ఒక నిండు ప్రాణాన్ని బలిగొనడంపై సర్వత్రా విచారం వ్యక్తమవుతోంది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవిని క్షమాపణలు కోరిన వర్మ ... ఎందుకో తెలుసా?

ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో మూవీకి చాలా అవార్డులు వస్తాయి - బీవీఎస్ రవి

Janhvi Swaroop: కౌశిక్ గోల్డ్, డైమండ్స్ ప్రచారకర్తగా జాన్వి స్వరూప్ ఘట్టమనేని

సంచలనంగా మారిన మన శంకరవర ప్రసాద్ గారు మీసాల పిల్ల సాంగ్

Mahesh Babu: మహేష్ బాబు .. బిజినెస్‌మ్యాన్ 4K ప్రింట్‌తో రీ-రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

రక్తలేమితో బాధపడేవారికి ఖర్జూరాలతో కౌంట్ పెరుగుతుంది

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

హ్యుందాయ్ హోప్ ఫర్ క్యాన్సర్ ద్వారా క్యాన్సర్ నుంచి సంరక్షణలో ముందడుగు

చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత?

తర్వాతి కథనం
Show comments