Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేచి నుంచి ఆన్‌లైన్‌లో గ్రూపు-2 మెయిన్ హాల్ టిక్కెట్లు

ఠాగూర్
గురువారం, 13 ఫిబ్రవరి 2025 (09:56 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) గ్రూపు-2 మెయిన్స్ పరీక్షలకు సంబంధించి ముఖ్యమైన ప్రకటన విడుదల చేసింది. గ్రూపు-2 మెయిన్స్ పరీక్ష హాల్ టిక్కెట్లను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. ఈ మేరకు హాల్ టిక్కెట్లను గురువారం నుంచి డౌన్‌లోడ్ చేసుకునేందుకు వీలుగా ప్రత్యేక లింకును కూడా విడుదల చేసినట్టు ఏపీపీఎస్సీ కార్యదర్శి ఐ.నరసింహ మూర్తి ఒక ప్రకటనలో తెలిపారు. 
 
అభ్యర్థులు గురువారం నుంచి హాల్ టిక్కెట్లను డౌన్‌లోడు చేసుకోవచ్చు. ఈ నెల 23వ తేదీ ఉదయం, మధ్యాహ్నం రెండు పేపర్లకు ఆఫ్‌లైన్‌లో పరీక్షలు నిర్వహించనున్నట్టు ఆయన వెల్లడించారు. రాష్ట్రంలోని ఉమ్మడి 13 జిల్లాల కేంద్రాల్లో ఈ పరీక్షలు జరుగుతాయని ఏపీపీఎస్సీ తెలిపింది. 
 
కాగా, తొలుత గ్రూపు 2 మెయిన్స్ పరీక్షను ఈ యేడాది జనవరి 5వ తేదీన నిర్వహించేలా నోటిఫికేషన్ జారీచేసింది. డిసెంబరు 21వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని నోటిఫికేషన్‌లో పేర్కొంది. దరఖాస్తుకు జనవరి 10, 2024 చివరి తేదీగా నిర్ణయించింది. ఫిబ్రవరి 25, 2024న గ్రూపు-2 ప్రిలిమ్స్ పరీక్షను ఏపీపీఎస్సీ నిర్వహించింది. 
 
గ్రూపు-2 మెయిన్స్‌ పరీకు 92250 మంది అర్హత సాధించగా, ఫలితాలను వెలువడిన తర్వాత మెయిన్స్ పరీక్షలు పలుమార్లు వాయిదాపడ్డాయి. చివరకి ఫిబ్రవరి 23వ తేదీన గ్రూపు-2 మెయిన్స్ పరీక్షలు జరుగనున్నాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 905 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫుల్ గడ్డంతో.. తండ్రిలాగే పంచె కట్టి సరికొత్త లుక్‌లో అకీరా నందన్

మా తాతగారు రసికుడు.. మెగాస్టార్ కామెంట్స్.. పవన్‌ పైన వైసిపి ట్రోల్స్

కన్నడ హీరో యష్‌తో కియారా అద్వానీకి కలిసి వస్తుందా?!!

సామాన్య వ్యక్తిలా మెగాస్టార్ చిరంజీవి వ్యాఖ్యలు: జాతీయ మీడియాల్లో వక్ర చర్చలు

నా కథల ఎంపిక వెరైటీ గా ఉంటుంది : రానా దగ్గుబాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

హైదరాబాద్ వేడి వాతావరణం, భౌగోళిక పరిస్థితులు డీహైడ్రేషన్ ప్రమాదంలో పడేస్తున్నాయి: హెచ్చరిస్తున్న నిపుణులు

బీట్ రూట్ జ్యూస్ ఉపయోగాలు

Malida Sweet: తెలంగాణ వంటకాల్లో చిరు ధాన్యాలు.. మిగిలిన చపాతీలతో మలిదలు చేస్తారు.. తెలుసా?

Garlic: వెల్లుల్లితో చుండ్రు సమస్యకు చెక్.. వెల్లుల్లిని నూనె తయారీ ఎలా?

తర్వాతి కథనం
Show comments