ఆర్టీసీ విలీనానికి ఆమోదం?

Webdunia
మంగళవారం, 3 సెప్టెంబరు 2019 (20:21 IST)
ఏపీఎస్ ఆర్టీసీ ని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు ఏర్పాటు చేసిన కమిటీ తమ అధ్యయన నివేదికను ఇవాళ ప్రభుత్వానికి అందించింది.

కమిటీ ఛైర్మన్ విశ్రాంత ఐపీఎస్ అధికారి ఆంజనేయ రెడ్డి సహా కమిటీ సభ్యులు ఇవాళ మధ్యాహ్నం తాడేపల్లి లోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ను కలిసి నివేదిక అందించారు. 
 
ఆర్టీసీ ని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు అనుసరించాల్సిన విధానాలపై రెండున్నర నెలల పాటు తాము చేసిన అధ్యయనాన్ని, పలు మార్గ దర్శకాలను సీఎం కు ఇచ్చే నివేదికలో పొందు పర్చినట్టు సమాచారం.

ఆర్టీసీ సంస్థ సహా కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేయడంపై సానుకూలంగా నివేదిక ఇచ్చింది. విలీనం పై ఐదు రకాల ఉత్తమ విధానాలను ప్రాధాన్యాల వారీగా సిఫార్సు చేశారు.

డీజిల్ ధరలు పెరగడంతో సంస్థకు నష్టాలు వస్తున్నందున ఎలక్ట్రికల్ బస్సులు ప్రవేశపెట్టడం పైనా కమిటీ నివేదిక ఇచ్చారు. బుధవారం జరిగే మంత్రి వర్గ భేటీలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే అంశంపై చర్చించి ఆమోదించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వాస్తవ ఘటన ఆధారంగా అభినయ కృష్ణ కామాఖ్య చిత్రం

కొడుకు వల్ల బిక్షాటన చేస్తున్న పెద్దాయన కథ ఆదారంగా దూరదర్శిని చిత్రం

NTR: ఎన్.టి.ఆర్., ప్రశాంత్ నీల్ చిత్రం ఆలస్యానికి కారణం అదే అన్న నిర్మాత

Bhavana: రేప్ మర్డర్ నేపద్యం గా భావన నటించిన డాక్టర్ కీర్తి ఎంబీబీఎస్ ఎంఎస్ తెలుగులో సిద్ధం

Manjula: అగధ లో ప్రముఖ నటి మంజుల మనవరాలు జోవికా విజయ్ కుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన రాగులను ఆహారంలో భాగం చేసుకుంటే?

Leg Cramps, బీరకాయ తింటే కొందరికి పిక్కలు పడతాయి, ఎందుకు?

వేసవిలో గోండ్ కతీరా చప్పరిస్తుంటే ఎంత మేలు చేస్తుందో తెలుసా?

ఆరోగ్యకరమైన పనితీరుకు ఎర్గోనామిక్స్ కీలకం: ప్రముఖ ఎర్గోనామిక్స్ నిపుణుడు మను నెల్లుట్లచే నాట్స్ వెబినార్

శరీర కండరాలు పెంచే ఆహార పదార్థాలు ఇవే

తర్వాతి కథనం
Show comments