Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిఠాపురం పీహెచ్‌సీకి మహర్ధశ - వైద్య సిబ్బంది.. వైద్య పరికరాలు

ఠాగూర్
శుక్రవారం, 11 అక్టోబరు 2024 (11:56 IST)
ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రాతినిథ్యం వహిస్తున్న పిఠాపురం కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రానికి మహర్ధశపట్టింది. తన నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు పవన్ ప్రత్యేక దృష్టిసారించారు. ఇందులోభాగంగా, తొలుత ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని సౌకర్యాల కొరతను తీర్చారు. అలాగే, నియోజకవర్గంలోని సమస్యల పరిష్కారం కోసం ఆయన అధికారులతో ఎప్పటికపుడు సమీక్ష నిర్వహిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా అధికారుల బృందాన్ని తన నియోజకవర్గానికి పంపించి క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలపై పరిశీలన చేయించి నివేదికలు తెప్పించుకుంటున్నారు. 
 
ఈ క్రమంలో పిఠాపురంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్‌సీ)లో వైద్యులు, సిబ్బంది కొరత, ఎక్స్‌రే యూనట్ పని చేయకపోవడాన్ని గుర్తించారు. దీనిపై కాకినాడ జిల్లా కలెక్టర్, జిల్లా వైద్యాధికారి, హెచ్.ఓ లతో ఆయన చర్చించారు. తక్షణమే పిఠాపురం సీహెచ్‌సిలో వైద్యులు, సిబ్బందిని నియమించాలని ఆదేశించారు. నియోజకవర్గంలో పెద్ద ఆస్పత్రి అయిన సీహెచ్‌సిలో మెరుగైన వైద్య సేవలు అందించాలని, రోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. 
 
దీంతో జిల్లా కలెక్టర్ పిఠాపురం సీహెచ్‌సికి సివిల్ అసిస్టెంట్ సర్జన్, మెడికల్ ఆఫీసర్‌తో పాటు ముగ్గురు స్టాఫ్ నర్సులు, ఒక జనరల్ డ్యూటీ అటెండెంట్‌లను నియమించారు. అలానే ఎక్స్‌రే యూనిట్‌ను పునరుద్ధరించారు. దీంతో ఎక్స్‌రే యూనిట్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. సీహెచ్‌సీ మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి రావడంతో ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దర్శక దిగ్గజం భారతీరాజా కుమారుడు మనోజ్ హఠాన్మరణం

రామ్ చరణ్‌తో మళ్లీ రొమాన్స్ చేస్తారా? సమంత ఏం చెప్పిందో తెలుసా? (video)

Charan: రామ్ చరణ్ పుట్టినరోజున పెద్ది టైటిల్ ప్రకటిస్తారా? - తాజా అప్ డేట్

బ్యూటీ భామ నీలఖికి యంగ్ సెన్సేషన్ అవార్డ్

కన్నప్ప లో మల్లు పాత్రలో నటించిన రఘు బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

హెచ్ అండ్ ఎం నుంచి మహిళల కోసం సరికొత్త ఫ్యాషన్ దుస్తులు

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments