Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ముగ్గురు పెళ్లాలతో డిప్యూటీ సీఎం అయ్యారు.. పవన్‌ను దించేయండి.. దివ్వెల మాధురి (Video)

Advertiesment
Divvala Madhuri

సెల్వి

, గురువారం, 10 అక్టోబరు 2024 (11:38 IST)
Divvala Madhuri
రెండో వివాహం, సంబంధం విషయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రిలేషన్ తప్పు కాకపోతే నాది తప్పు ఎలా అవుతుంది? అంటూ దివ్వెల మాధురి ప్రశ్నించింది. తమ ప్రేమ, సహజీవనం గురించి విమర్శలు చేస్తున్న వారికి వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి జంట స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. వ్యక్తిగత విషయాలను పార్టీకి లింక్ చేయొద్దు అంటూ దువ్వాడ శ్రీనివాస్ చెప్పుకొచ్చారు. ఇంట్లో భార్యలను పెట్టుకుని దొంగచాటు వ్యవహారాలు నడుపుతున్న వారు కూడా తమపై నిందలు వేయడం విడ్డూరంగా ఉందన్నారు. 
 
ఇక ముగ్గురు భార్యలున్న పవన్ కళ్యాణ్‌ డిప్యూటీ సీఎం ఎలా అయ్యాడని మాధురి ప్రశ్నించారు. ఒకరికి డైవర్స్ ఇచ్చి.. మరో మహిళతో లివింగ్ రిలేషన్లో ఉంటూ.. ఇంకో మహిళను ప్రెగ్నెంట్ చేసిన అతడిని డిప్యూటీ సీఎంగా ఎందుకు కూర్చోబెట్టారని ఆమె అన్నారు. అయినా ఈ రోజుల్లో ఎవరు పర్ఫెక్ట్‌గా ఉన్నారంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. 
 
ఇక ఒక బాధ్యాయుతమైన పదవిలో ఉన్న శ్రీనివాస్ కుటుంబ సమస్యల కారణంగా న్యాయం చేయలేకపోతున్నానని, పార్టీ నుంచి తనను సస్పెండ్ చేయమని స్వయంగా జగన్ ను కోరినట్లు చెప్పారు. కానీ నెమ్మదిగా అన్ని సెటిల్ అవుతాయి, దీనికే పార్టీనుంచి వెళ్లిపోవాల్సిన అవసరం లేదని జగన్ చెప్పినట్లు తెలిపారు. మరోవైపు భార్య వాణితో ఏరోజు సంతోషంగా లేనన్నారు. పెళ్లైన రెండేళ్లకే టార్చర్ చేసిందని, ఆమెతో కలిసున్నని రోజులు నరకం చూపించిందన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణలో వైభవంగా బతుకమ్మ పండుగ.. కళకళలాడిన రాజ్‌భవన్‌