Webdunia - Bharat's app for daily news and videos

Install App

యువ‌తి వివాహానికి ఏపీబీజేఏ రూ.10 వేలు ఆర్ధిక సహాయం

Webdunia
శుక్రవారం, 23 జులై 2021 (16:56 IST)
క‌రోనా క‌ష్ట కాలంలో నిరుపేద‌ల‌ను ఆదుకునేందుకు మ‌న‌సున్న మ‌హ‌రాజులు ముందుకు రావాల‌ని, పేద‌ల‌ను మాన‌వ‌తా ధృక్ప‌దంతో ఆదుకుంటున్న దాత‌ల సేవ‌లు ఎన‌లేనివ‌ని, క‌ష్ట‌కాలంలో ఉన్న వారికి స‌హాయ ప‌డ‌డంలో ప్ర‌తి ఒక్క‌రు ముందుండాల‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ బ్రాడ్‌కాస్ట్ జ‌ర్న‌లిస్ట్ అసోసియేష‌న్ రాష్ట్ర ఉపాధ్య‌క్షుడు పి మీరాహుస్సేన్‌ఖాన్ పేర్కొన్నారు.

నందిగామ ప‌ట్ట‌ణానికి చెందిన పేదింటి యువ‌తి వివాహ ఖ‌ర్చుల నిమిత్తం మీరాహుస్సేన్‌ఖాన్ త‌న మిత్ర‌బృందంతో క‌లిసి రూ. 10,116లు ఆర్ధిక స‌హాయం యువ‌తి బంధువుల‌కు అంద‌చేశారు. ఈ సంద‌ర్భంగా మీరా హుస్సేన్ మాట్లాడుతూ, క‌ష్టాల్లో ఉన్న‌వారికి స‌హాయం అందించ‌డంలో ఉన్న సంతృప్తి మ‌రెందులో ఉండ‌ద‌ని, మ‌నం ఎంత సంపాదించామ‌న్న దానికంటే ఎదుటివారికి ఎంతో కొంత స‌హాయప‌డ‌డం ముఖ్యం అన్నారు.

త‌న‌తో పాటు స‌హాయం అందించిన త‌న మిత్ర‌బృందానికి పేరుపేరున కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ప్ర‌తినెల ఏదోఒక సేవా కార్య‌క్ర‌మం త‌న మిత్రుల‌తో క‌లిసి చేయ‌డం ఆనందం క‌లిగిస్తుంద‌ని, మున్ముందు మ‌రెన్నో సేవా కార్య‌క్ర‌మాలు చేప‌డ‌తామ‌ని వివ‌రించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ వ‌ర్కింగ్ జ‌ర్న‌లిస్ట్ ఫెడ‌రేష‌న్ జిల్లా నాయ‌కులు ఆకుల వెంక‌ట‌నారాయ‌ణ‌, ప‌ఠాన్ సైదాఖాన్‌, శ్రీ‌నివాస‌రావు, యువతి బంధువులు సాధిక్‌, బాజి, త‌దిత‌రులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pushpa 2: The Rule నటుడు శ్రీతేజ్ పెళ్లి చేసుకుంటానని మోసం: యువతి ఫిర్యాదు

ఫెస్టివల్స్ అనంతరం థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న వేదిక మూవీ ఫియర్

ఏఆర్.రెహ్మాన్ తండ్రిలాంటివారు... ఆ సంబంధం అంటగట్టొద్దు ప్లీజ్ : మోహిని డే

రామ్ చరణ్ తాజా టైటిల్ పెద్ది - మైసూర్ లో యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ?

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments